30 సెకండ్స్ లో సెల్ ఫోన్ చార్జ్

ఈశా ఖరే…

ఈమె అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో పుట్టి పెరిగారు. భారతీయ సంతతికి చెందిన ఈశా లిం బ్రూక్ విద్యాలయంలో చదువుకుంటున్న ఈమెకు సైన్స్ పై మక్కువెక్కువ. ఆమె ప్రతిభను గుర్తించి గూగుల్ సంస్థ మరీ మరీ ఆమెను వెతికి పట్టుకుని తమ సంస్థకు రావలసిందిగా పిలిపించుకుంది.

ఆమె కనుగొన్న సూపర్ కపాసిటర్  ను  2013 వ సంవత్సరంలో ఆరిజోనా రాష్ట్రంలో జరిగిన ఇంటెల్ ప్రదర్శనలో ప్రదర్శించారు. ఈ  కాపాసిటర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది అతి చిన్న సైజులో తయారైనది. దీని గొప్పదనం ఏమిటంటే ఎక్కువ స్థాయిలో ఎనర్జీని నిల్వ చేసుకోవచ్చు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలలోనైనా దీనిని అతి సులభంగా ఉపయోగించుకోవచ్చు. అంత దాకా ఎందుకు ఒక సెల్ ఫోనులో సైతం దీనిని అమర్చి బాటరీని రీ చార్జ్ చేసుకునే వీలుంది. పైగా కేవలం 30 సెకండ్స్ లో సెల్ ఫోన్ రీ  చార్జ్ అయిపోతుందంటే ఆశ్చర్యమే కదూ.

ఈ సూపర్ ఫాస్ట్ కపాసిటర్  తయారు చెయ్యడానికి నువ్వు నేను అని పలు సంస్థలు ఆమెను కాంటాక్ట్ చేస్తున్నాయి. వాటిలో గూగుల్ సంస్థ కూడా ఉండటం విశేషం.

ఈ  కపాసిటర్  ను తయారు చేసిన ఈశాకు ఇంటెల్ ప్రదర్శనలో యాభై వేల డాలర్లు (అంటే మన కరెన్సీలో దాదాపు ముప్పై లక్షల రూపాయలు) కానుకగా లభించాయి. అంతే కాదు ఆ ప్రదర్శనలో 70 దేశాల నుంచి దాదాపు 1600 మంది పాల్గొనగా ఈశాకు రెండవ స్థానం దక్కడం విశేషం.

తనకు దక్కిన పారితోషికంతో ఆమె హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పై చదువులు చదువుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఇంతకూ ఇటువంటి సూపర్  కపాసిటర్  ను ఎందుకు తయారు చేసారని అడగ్గా దానికి ఆమె ఇచ్చిన సమాధానం చూద్దాం….

నా సెల్ ఫోన్ బాటరీ ఎప్పుడు రీ చార్జ్ చేసినా ఎక్కువ సేపు ఉండేది కాదు. కాస్సేపటికే బాటరీ తీరిపోయేది. మళ్ళీ రేచార్జ్ చెయ్యవలసి వచ్చేది. దానితో ఆలోచించి ఆలోచించి ఈ సూపర్  కపాసిటర్  ను కనుగొన్నానని ఈశా జవాబిచ్చారు.

Send a Comment

Your email address will not be published.