MTF అంతర్జాతీయ మహిళా దినోత్సవం

మ- ఇచ్చాశక్తి..
హి- క్రీయాశక్తి..
ళ- జ్ఞాన శక్తి..

త్రిశక్తి రూపాలైన మహిళలకు శతకోటివందనములు.

మెల్బోర్న్ నగరంలోని గజల్ రిస్టారెంట్ లో MTF కి చెందిన స్త్రీ విభాగము (శ్రీమతి లక్ష్మి నూకల, శ్రీమతి నందిని బిస్కుంద, ప్రశాంతి తౌటి రెడ్డి, చందన, స్రవంతి వేముల మరియు వాణి రెడ్డి) అధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం రంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ముఖ్యంగా ఈ సంవత్సరం ఎప్పటిలాగానే మన సమాజంలో ఉన్నత విలువలతో సేవలందించిన ఇద్దరు స్త్రీ మూర్తులను సత్కరించడమే కాకుండా హైదరాబాద్ లోని సర్వ్ నీడి (www.serveneedy.org) సంస్థకు ఆర్ధిక సహాయం అందించడంలో కృతకృత్యులయ్యారు. ఈ సందర్భంగా $700 డాలర్లు జమచేసి సర్వ్ నీడి సంస్థకు పంపించడం జరిగింది.

DSC_321

శ్రీమతి నందిని గారు సర్వ్ నీడి గురించి ఒక పవర్ పాయింట్ ప్రేసెంటేషన్ లో వారు చేస్తున్న హృదయ విదారకమైన దృశ్యాలను చూపించి ప్రేక్షకుల మన్నలను పొందారు.

శ్రీమతి లక్ష్మి నూకల గారు స్వాగతం పలుకుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం చరిత్ర గురించి మరియు స్త్రీ సాధికారత గురించి వివరించారు.

ఈ సంవత్సరం ముఖ్య అతిధులుగా విచ్చేసిన శ్రీమతి మోనికా రైజాద, అధ్యక్షులు WOW మరియు శ్రీమతి నీతు బాబాని (వీరు చాలా సాంస్కృతిక సేవా సంస్థలకు తమ సేవలందిస్తారు) గార్లకు వారి సేవా తత్పరతకు సాదరంగా సత్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమానికి శ్రీమతి వాణి బైరి President of TWAA, శ్రీమతి చందన రావు పోలసాని Polasani JET Australia, శ్రీమతి సుమిత్రా కళ్యాణ్ Executive committee member-TAAI మరియు శ్రీమతి గీతా పసుపులేటి AMA organisation Team member హాజరయ్యారు.

శ్రీవిద్య అశోక్ గారు తన వాక్చాతుర్యంతో ఆహూతులందరిని సమూహితులను చేసి ఈ కార్యక్రమ నిర్వహణకు ఎంతో సహాయం చేసారు. ఎంతో సరదాగా ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమంలోServe Needy ఆటలు, ఫాషన్ షో, ప్రశ్న-సమాధానాలు, నృత్యాలు కూడా నిర్వహించడం జరిగింది.

Serve Needy (www.serveneedy.org) గురించి
హైదరాబాద్ లోని ఈ స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపక అధినేత శ్రీ గౌతమ్ వయస్సు 30 ఏళ్ల లోపే. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అనాధ పిల్లలకు సేద దీర్చడం, ముసలివారికి ఆహారం అందించడం, రోడ్లు శుబ్రం చేయడం, కాన్సర్ వ్యాధి బారిన పడిన వారికి ఆదుకోవడం ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరిన్ని వివవరాలు వెబ్సైటులో చూడగలరు.

ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడానికి తోడ్పడిన వ్యక్తులు/సంస్థలు ప్రేమలత దుడుక, WAITE Group of companies for finance, property, development మరియు నీతు బాబాని, Indian clothes and Jewellery in Melbourne వారికి శ్రీమతి నందిని గారు కృతజ్ఞతలు తెలిపారు.
DSC_0190

Send a Comment

Your email address will not be published.