MTF వుమెన్స్ డే

అమ్మ –
కనులెదుట కనిపించే దైవం నీవు
ప్రేమకు నిజ ప్రతి రూపం నీవు
మమతాను బంధాల వారధి నీవు
మధుర స్మృతల మనో వీణవు నీవు

స్త్రీ – అమ్మగా, చెల్లిగా, అర్ధాంగిగా తన జీవితాన్ని ధార పోసి తన కుటుంబాన్ని ప్రపంచంలో కెల్ల అత్యుత్తమమైన రీతిలో తీర్చి దిద్దాలన్న దీక్షతో తదేక ధ్యానంతో ముందుకు సాగిపోతుంది. తన జీవితంలో గృహం ఒక భాగం గనుక గృహిణిగా గుర్తించబడింది. నిస్వార్ధంగా తన కుటుంబమే తన లోకం కాగా కర్యార్ది అయి కలకాలం కష్టంలోనే తన సుఖాన్ని వెదుక్కుంటూ రాత్రింబవళ్ళు ఓర్పుతో, నేర్పుతో పిల్లల జీవితాల్ని తీర్చి దిద్దుతుంది. అటువంటి స్త్రీ కోసం “అంతర్జాతీయ స్త్రీ దినోత్సవం” సందర్భంగా ప్రత్యేకించి ఒక రోజు దైనందిన జీవితంలో కేటాయించి ఒక చక్కని కార్యక్రమం జరుపుకోవడం ముదావహం.

ఈ సందర్భంగా మెగ్రాత్ ఫౌండేషన్ కోసం కొంత సొమ్ముని కూడబెట్టడం జరిగింది.

ఈ సందర్భంగా స్త్రీల అభ్యున్నతి గురించి పాటుపడుతూ మరియు ఇతర సాంఘిక వ్యవహారాలలో నిష్ణాతులైన ముగ్గురు స్త్రీలను సన్మానించడం జరిగింది. వారు:
1. శ్రీమతి అర్చన కూర్తి
2. శ్రీమతి సంగీత సింగ్ (2015 Mrs ఆస్ట్రేలియా టైటిల్ హోల్డర్)
3. జాకీ (womens project worker and a representative of Australian Multicultural community service)

పిల్లలకు ఆటలు, పాటల కార్యక్రమంతో అందరికీ పసందైన విందు భోజనం ఏర్పాటు చేయడం జరిగింది.

Send a Comment

Your email address will not be published.