తెలుగు వారి ఆత్మ బంధువు

వివిధ రంగాల్లో నిష్ణాతులైన తెలుగు వారు షుమారు లక్ష పైగా ఆస్ట్రేలియా, న్యూ జిలాండ్ దేశాల్లో నివసిస్తున్నారు.  ప్రతీ నెలా ఏదో ఒక నగరంలో సాంస్కృతిక కార్యక్రమం, ఆటల పోటీలు, లేక సామూహిక వ్రతాలు జరుగుతూ వున్నాయి.  వీటి గురించి తెలుసుకోవాలన్న కుతూహలం అందరికీ వుంటుంది.  అయితే ఈ విప్లవాత్మక సమాచార యుగంలో మనకంటూ ఒక సరైన సమాచార మాధ్యమం లేకపోవడం ఎంతో ఖిన్నులను చేసింది.  దీనికి సమాధానంగా ఇప్పుడు అంతర్జాలంలో “తెలుగుమల్లి”  వినూత్నమైన రీతిలో  అన్ని వయస్సుల వారికీ సమాచారం తో పాటు  ముఖ్యంగా మన పిల్లలు  భాష నేర్చుకోవడానికి ఉపయోగపడే దృశ్య శ్రవణ విషయాలు జోడించడం ఎంతో  ఆనంద దాయకమైన విషయం.

ఈ తెలుగుమల్లి తెలుగు వారందరికీ ఒక వారధిగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ
ఆది రెడ్డి యార్ర
సౌత్ ఆస్ట్రేలియా తెలుగు సంఘం అధ్యక్షులు

Send a Comment

Your email address will not be published.