TLCFA - Sankranti

భిన్నత్వంలో ఏకత్వం అన్నది పాత నినాదమే అయినా సంక్రాంతి సంబరాన్ని సరిక్రొత్త కోణంలో నిర్వహించి బహుళ సంస్కృతీ సంప్రదాయానికి నూతన నిర్వచనం ఇచ్చారు తెలుగు లాంగ్వేజ్ అండ్ కల్చరల్ ఫౌండేషన్ వారు.  గత నెల 27వ తేదీన జరిగిన సంక్రాంతి సంబరాల్లో గత సంవత్సరంలాగానే  ముగ్గుల పోటీలు, పతంగులు ఎగురవేయడం, భారతీయ సాంప్రదాయ దుస్తులు ధరించడం మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి స్థానిక రాజకీయ నాయకులతో పాటు ప్రముఖ కవి, ఆధ్యాత్మిక తత్వవేత్త, తెలంగాణా రాష్ట్ర గీత రచయిత శ్రీ అందెశ్రీ గారు భారత దేశం నుండి విచ్చేసి సంక్రాంతి పండుగకు వన్నె తెచ్చారు.

స్థానిక పార్లమెంటు సభ్యులు Ms ఆన బర్క్ ముఖ్య అతిధిగా పాల్గొని  ‘Find YourSelf’ – Break from the routine | Follow your passion’ అన్న కార్యక్రమాన్ని స్త్రీల సాధికారత కోసం ప్రారంబించారు.

ఈ కార్యక్రమంలో మోనాష్ సిటీ మేయర్ స్టెఫనీ పెర్రి, ఆస్టన్ లేబర్ సభ్యులు పాల్ క్లిసారిస్, మల్గ్రావ్ వార్డ్ కౌన్సిలర్ రాబర్ట్ డేవిస్, నాక్స్ మాజీ మేయర్ పీటర్ లాక్ వుడ్, విక్టోరియా మల్టీ కల్చరల్ కమీషనర్ డా. సుందరం సిల్వమలై మరియు గ్లోబల్ తెలంగాణా ఫోరం అంబాసిడర్ బసంత్ రెడ్డి గారు ప్రత్యెక అతిధులుగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పిల్లలు, పెద్దలు చేసిన వివిధ అంశాలు అతిధులను, ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

రంగోలి పోటీల్లో పాల్గొన్న వారికి ప్రధమ, ద్వితీయ బహుమతులు ఇవ్వడం జరిగింది.

డా. అందె శ్రీ గారి గురించి…
ప్రజా కవి, లోక కవి అని పేరొందిన డా.అందె శ్రీ గారు ఒక అనాధగా గొడ్లకాపరిగా జీవితం ప్రారంభించి చిన్నతనం నుండి వీధి బాగోతం, యక్షగానం పాటలు వింటూ అవే పాటలను తనకు తానుగా పాడుతూ తనకంటూ ఒక విలక్షణమైన నేపధ్యాన్ని అలవరుచుకొని పాటలు, గేయాలు వ్రాయడం మొదలుపెట్టారు. ప్రస్తుతం ప్రపంచంలోని నదులన్నిటినీ సందర్శించి వాటిపై ఒక కావ్యాన్ని వ్రాసే ప్రక్రియలో ఆస్ట్రేలియా రావడం జరిగింది.  శ్రీ అందె శ్రీ గారు వారు రచించి గానం చేసిన కొన్ని గీతాలను స్వయంగా పాడటం ఈ కార్యక్రమానికి ప్రధానాంశం

Send a Comment

Your email address will not be published.