అక్టోబర్‌ 4న 'నోటా'

NOTAసెన్సేషనల్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ నోటా. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను అక్టోబర్‌ 4న రిలీజ్‌ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. పెళ్లి చూపులు, అర్జున్‌ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్‌హిట్‌ తరువాత తెరకెక్కుతున్న నోటాతో విజయ్‌ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. విజయ్‌ సరసన మెహరీన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు ఆనంద్‌ శంకర్‌ దర్శకుడు.

బుధవారం స్నీక్‌పీక్‌ పేరుతో 30 సెకన్ల టీజర్‌ను రిలీజ్‌ చేసిన చిత్రయూనిట్ ఈ రోజు (గురువారం) ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విజయ్‌ దేవరకొండను తమిళ ఇండస్ట్రీకి ఆహ్వానిస్తూ నోటా తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అదే సమయంలో తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు చిత్రయూనిట్‌. పొలిటికల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో విజయ్‌ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై జ్ఞానవేల్‌ రాజ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.