అక్షర దీపానికి ముచ్చటగా మూడేళ్ళు

Wata_Telugubadi_2
Wata_Telugubadi_7
తెలుగు అక్షరం ముద్దు ముద్దుగా మురిసిపోతోంది. ప్రవాసంలో చిన్నారులు అ, ఆ లను అందంగా దిద్దుతోంటే తెలుగు అక్షరాలు తమ ఆనందానికి హద్దులు లేకుండా పరవశంతో పొంగిపోతున్నాయి. అక్షర సుమాలు అమ్మ భాషకు అందలం పడుతున్న ఆ చిన్నారుల చేతులు పట్టుకొని గట్టిగా అద్దుకుంటున్నాయి.

పర సంస్కృతితో సహజీవనం చేస్తూ మన భాషలో మన పిల్లలు మాట్లాడితే వినాలని ఎంతో చక్కని ప్రయత్నంతో పెర్త్ నగరంలోని తెలుగు సంఘం గత మూడు సంవత్సరాలుగా కృషి చేస్తుంది. ఈ కృషికి ఫలితంగా ఇప్పుడు రెండు బడులలో (Bayswater and Willetton) పిల్లలకు తెలుగు బోధన జరుగుతుంది. షుమారు 64 మంది పిల్లలు వివిధ స్థాయిల్లో తెలుగు నేర్చుకుంటున్నారు. 12 మంది స్వచ్చంద సేవకులు సమన్వయంతో ఈ రెండు బడులు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. వెస్టర్న్ ఆస్ట్రేలియా మల్టీ కల్చరల్ విభాగం వారి సహాయంతో చాలామంది ప్రొఫెషనల్ డెవలప్ మెంట్ లో శిక్షణ పొంది ఒక క్రమ పద్ధతిలో బోధనా కార్యక్రమాలు చేపడుతున్నారు.

అయితే ఈ రెండు బడుల విజయానికి కారణం వారు అనుసరిస్తున్న బోధనా పద్ధతులు. సుశిక్షుతులైన స్వచ్చంద సేవకులు ఇక్కడి పిల్లలకు ఏ విధంగా బోధిస్తే వారు భాషను సులువుగా నేర్చుకోగలుగుతారో ఆ బోధనా పద్ధతులను అనుసరించి పాఠ్యాంశాల అభివృద్ది సమన్వయకర్త అనుసంధానంతో ఒక పద్దతిగా నడుపుతున్న తెలుగుబడులు దినదినాభివృద్ధితో ప్రవర్ధమానము చెందుచున్నాయి.

Wata_Telugubadi_8
Wata_Telugubadi_3
Wata_Telugubadi_10
Wata_Telugubadi_12
తెలుగు బడిలో అభ్యాసం చేస్తున్న పిల్లలకు వారి ప్రతిభను ప్రదర్శించడానికి అవకాశాలు కల్పిస్తున్నారు. తెలుగు సంఘం నిర్వహిస్తున్న ప్రతీ కార్యక్రమంలో వారి నైపుణ్యతను కనబరచడానికి తప్పకుండా ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తున్నారు. అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవంలో పాల్గొని దాని ప్రాముఖ్యతను చెబుతున్నారు. ఆటలద్వారా తెలుగు పదాలను, వాక్యాలను, సంభాషణలను నేర్పుతున్నారు. పిల్లలు ప్రతీ వారం ఈ తరగతుల కోసం ఎదురుచూసేటట్లు తగిన పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారు. ప్రతీ సంవత్సరం నవంబరు నెలలో ఘనంగా వార్షికోత్సవం జరిపి వారితోనే సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి పిల్లలందరికీ యోగ్యతా పత్రాలను అందజేస్తున్నారు.

ముచ్చటగా మూడవ వార్షికోత్సవం గత నెల 25వ తేదీన ఘనంగా జరుపుకున్నారు. ఈ సంవత్సరం రెండు బడుల పిల్లలతో పాటలు, భక్తీ గీతాలు, నృత్య రూపకాలు, లఘు నాటికలు వేయించారు. ప్రత్యేకంగా “రామాయణ కవితా ఘోష్టి” కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా Hon. Liz Harvey, Deputy Opposition Leader విచ్చేసి పిల్లలందరికీ యోగ్యతా పత్రాలు అందజేశారు. Mr James Jegasothy, Director Community Engagement & Strategy, OMI గారు వచ్చి పిల్లలకు బహుమతులు అందజేశారు. శ్రీ హరి చిల్లప గారు ఈ సందర్భంగా మాట్లాడారు.

ఈ కార్యక్రమానికి శ్రీ చంద్ర ఇందుర్తి గారు స్వాగత వచనాలు పలుకగా శ్రీ శ్రీనివాస్ కంబల గారు వందనసమర్పణ చేసారు. ఈ కార్యక్రమానికి శ్రీమతి డా. రజని పలాడి గారు మరియు పద్మ బోయపాటి గారు సహాయసహకారాలందించారు.
Wata_Telugubadi_9
Wata_Telugubadi_1

Send a Comment

Your email address will not be published.