మాతృభాష

మాతృభాష

ప్రవాసంలో..
మనిషి మనసు తెలిపేది మాతృభాష
బతుకు బండి నడిపేది ఇంగ్లీష్ భాష
ఏ ఒక్కటి కరువైనా మనుగడే సమస్య
అన్నీ సమకూడినా ఏదో కొరవడి
ప్రతి ప్రవాసంద్రుడి మదిలో
మరుగున మెదిలే మొదటి ప్రశ్న
ఎంత ధనంబెన్ని గృహములున్నా
నవాబుల జేబు నిండుగా నున్నా
జీవితంలో వెలితికి జవాబులేక
పోగొట్టుకున్నదేదో గురుతుకురాక
గురుతెరిగే తీరిక లేక, అలుపెరుగని
ప్రవాసజీవితచక్రం ఒక పరి ఆపి
నడిపేందుకు మనస్కరించక
పరిగెడుతూ , పోర్లిపడుతూ…
అలసటతో ..అమ్మా! అనినార్తిగా
గురుతుకొచ్చి గమనించెనపుడు
తను మరచింది మాతృభాషని
మరువలేనిది అమ్మప్రేమనీ….!
………………………………………………….
ప్రతి హై వే లో మనం గమనిస్తే “స్టాప్ …రివైవ్ ….సర్ర్వివ్ ”
అని చూస్తూంటాం …..
జీవితమనే వెహికల్కు కూడా ఆ స్లోగన్ సరిపోతుందని ఈ కవిత వ్రాసాను

Send a Comment

Your email address will not be published.