'ఆపద్బాంధవుడు' కి 28 వసంతాలు

'ఆపద్బాంధవుడు' కి 28 వసంతాలు

28 వసంతాలు పూర్తిచేసుకున్న చిరు ఆపద్బాంధవుడు!

మెగాస్టార్‌ చిరంజీవికి ఉత్తమ నటుడిగా రెండో సారి నంది అవార్డు తీసుకొచ్చిన చిత్రం ఆపద్బాంధవుడు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు కొంచెంలో మిస్ అయ్యింది . అలాగే 5 నంది అవార్డులు గెలుచుకున్న చిత్రం . ఇందులో చిరు అభినయం ఇంటిల్లిపాదినీ కట్టిపడేసింది. ముఖ్యంగా మానసిక వికలాంగుడిగా చిరంజీవి ప్రదర్శించిన అభినయం తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలాగే శివుని పాత్రలో సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యినట్టు ఉంటుంది ఈ చిత్రంలోని చిరు పాత్ర. ఇక మీనాక్షి శేషాద్రి కథానాయకిగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు . అలాగే ఎం.ఎం.కీరవాణి అందించిన సంగీత స్వరాలు ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉంటాయి. కె.విశ్వనాథ్‌ – ఏడిద నాగేశ్వరరావు కలయికలో రూపొందిన చివరి చిత్రం కూడా ఇదే. ఈ చిత్రం తరువాత సినీనిర్మాణానికి దూరమయ్యారు ఏడిద నాగేశ్వరరావు. అయితే నిర్మాతగా మాత్రం ఆయన్ను అన్ని విధాలా సంతృప్తిపరచిన చిత్రమిదని చెప్పవచ్చు. పూర్ణోదయ సంస్థ ప్రతిష్టని మరింత ఇనుమడింప చేసింది. జంధ్యాల తొలిసారి మేకప్‌ వేసుకొన్న సినిమా కూడా ఇదే. ఈ చిత్రానికి మాటలు అందించిన జంధ్యాల..ఇందులోని పరంధామరాజు అనే పాత్రని ప్రేమించడం మొదలెట్టారు. చివరకి ఈ పాత్ర నేనే చేస్తా అని ఏడిద నాగేశ్వరరావుకి ఓ చీటి రాసిచ్చారు. దర్శకుడు కె.విశ్వనాథ్‌ ఒప్పుకోవడంతో జంధ్యాల మేకప్‌ వేసుకొన్నారు. ఆయన నటించిన మొదటి – చివరి చిత్రం కూడా ఇదే కావడం విశేషం. నేటికి ఈ సినిమా విడుదలై (అక్టోబర్‌ 9, 1992) ఇరవైఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది.

Send a Comment

Your email address will not be published.