ఇంటింటి తీరు వేరు...

ఇంటింటి తీరు వేరు...
ఇంటింటి తీరు వేరు ,ప్రతి ఇంటి తీరు మారు. మనిషి మనిషి పోలిక వేరు, ప్రతి మనిషి పోలిక మారు॥  ఇంటింటి తీరు వేరు॥ఆ చార వ్యవహారములు, ఆలోచనాశైలిఆచరణా  వైనం అతిధీ అభ్యాగత ఆదర సత్కార తీరు,ఆత్మీయతాభావ సంభాషణాతీరు, వైవిధ్య రీతులనుండు

॥ ఇంటింటి తీరు వేరు॥

శుచి శుభ్రతలు, స్థితి గతులు, సమయా సమయ పాలనలు,గృహాలంకరణ రీతులు, కనువిందై, సంగీత నాట్య కళా సరస సంభాషణా రీతుల,సోభాయమానమై ఆహ్లాదము గొలుపుచు, ఆచరింప అనుకరింప ఊహ కలిగించు కొన్ని గృహములు

॥ ఇంటింటి తీరు వేరు ॥

మరికొన్ని అశుచి అసుభ్రతలు, ఆరాట పోరాటాలు,ఆసమయ పాలనలు, అస్థిర నిర్ణయములు ఏవగింపు కలిగించునటుల, ఎబ్బెట్టుగా తోచు

॥ ఇంటింటితీరు వేరు ॥

మనిషి మనిషి పోలికవేరు,  ప్రతి మనిషి పోలిక మారు. రూపు రేఖా విలాసాలు, హావభావ విన్యాసాలు,నడవడికల నైజం, నైతిక ప్రవర్తనాతీరు,వైవిధ్య రీతుల నుండు, చింతా వంతల

 

ఉన్నాగాని చిరునవ్వులమాటున మరుగుపరచి, అధరముల దరహాసముతో ఎదుటివారి మొదముగూర్చి, వున్నంతలో సంతృప్తితో ఇతరులకు సహాయ సహకారము లందించు,అరుదైన ప్రవృత్తి గలవారై, మైత్రీ బంధ బాంధవ్య బంధముల,బలోపేతచేయు॥ మనిషి ,మనిషి పోలిక వెరు.॥

మరికొందరు చిడి ముడి మోము,చిర చిర భావం, చిన్తావంటలు,కష్ట నష్టాలు అన్ని తమకే నని ఇతరుల గాంచి ఈర్ష్యా ద్వేషముల మ్రగ్గిపోయి కోపతాపములలో మ్రగ్గిపోవు చుందురుఏది ఎట్లున్నగాని ఏ గృహ వాతావరణం, ఏ మనిషి నైజం ఎతీరునున్నగాని ఎదుటివారు  ఎద్దేవా సేయక,ఇంచుక సంయమనము శాన్త, సామరస్యముల మెలగిన,మైత్రీ బంధ బాంధవ్య  బంధములు శా శ్వ తమై  కొనసాగు,కాదేని, కలతలు రేగి అనతికాలమున మలిగిపోవు॥ ఇంటింటి తీరు వేరు,ప్రతి ఇంటి తీరు మారు,మనిషి మనిషి తీరు వేరు ప్రతిననిషి పోలిక మారు

॥కామేశ్వరి భమిడి పాటి . పి.ఎ.యు.ఎస్ ఎ

Send a Comment

Your email address will not be published.