ఎల్లి పరుగు లెందుకే--

పంట సేను గట్లంట లేడి కూనల్లె ,
పరుగు లెందుకే ఎల్లి, నా బంగారు యెల్లి,
పరుగు లెందుకే .
పట్టుకు దొరక వెందుకే

పిక్క బలం సూపించు మాంవా
పచ్చని సేలని సూసి
పంట పొలమై పోవాలనుంది మాంవా ,
పైరు పాటల్ల కలసి పోవాలనుంది ,
అందుకే మాంవ అందుకే ఈపరుగులన్దుకె,॥ పంట సేను గట్లంట ॥

అట్టా అనమాకె ఎల్లి ,నా బంగారు ఎల్లి ,
ఇద్దరం మన మిద్దరం కలిసి ,
పైలా పచ్చీసుగా ఏటి గట్లంట ,
పంట పోలాలెంబడి సింత తోపులల్ల ,
బలాదూర్ తిరిగి ,
బయస్కోపులు సూసి ,
తిను బండా రాలేవో తిని ,
హాయిగా
పొద్దుగూకి నంక గూడు సేరి ,
సరదా సంతోషాలు సెద్దము.
గువ్వలమై ఒదిగి పోదము ॥ పంటసేను గట్లంట ॥
—————————————–
కామేశ్వరి సాంబమూర్తి .భమిడి పాటి

Send a Comment

Your email address will not be published.