కథలు రాయాలన్న కోరిక సహజమే

కథలు రాయాలన్న కోరిక సహజమే

రావి శాస్త్రి అనే రాచకొండ విశ్వనాధ శాస్త్రికి చిన్నప్పటి నుంచే కథలు రాయాలనే కోరిక ఉండేది. అయితే కథలు ఎలా రాయాలని ఆయన ఎవరెవరినో అడిగారు. కానీ ఎవరూ చెప్పలేదు. పైగా అప్పట్లో ఆయనకు రచయితలు ఎవరూ తెలీదు. ఆయన తన పదో ఏట ఓ రచయితను దర్శించే భాగ్యం కలిగింది. ఆ రచయిత మరెవరో కాదు అబ్బూరి వరద రాజేశ్వర రావు. రావి శాస్త్రి సెకండ్ ఫాం చదువుతున్న రోజుల్లో అబ్బూరివారి ఆయనకు క్లాస్ మేట్ అయ్యారు. అప్పట్లో అబ్బూరి వారు గేయం రాసారు తప్ప కథ రాయలేదు. అయినప్పటికీ రావి శాస్త్రి ఆయనను అద్భుతమైన వ్యక్తిగా చూసారు. అబ్బూరి వారు రాసిన గేయం భావం ఏమిటంటే దేవుడు లేదు అన్నదే. కథలు రాయడం తెలియకపోయినా రావి శాస్త్రి అందుబాటులో ఉన్న కథలన్నీ చదువుతుండే వారు. అలా చదువుతూ ఉండటంతో కొంతకాలానికి రావి శాస్త్రికి కథలు ఎలా రాయాలో కాస్తంత తెలిసింది.

కథలు చెప్పాలనే కోరిక ఉండటం మానవ సహజమే. ఆ కోరికకు ఫలానా జాతి, ఫలానా మతం వంటి విచక్షణ ఉండదు. అయితే కథలు రాయాలన్న కోరిక రావి శాస్త్రికి అంత సులభంగా తీరలేదు. ఆ కోరిక తీరడానికి ఆయన ఎంతో కష్టపడవలసి వచ్చింది. కథలనేవి వాస్తవ జీవితంలో నుంచే పుడతాయని చెప్పిన ఆయన జీవితంలో జరుగుతున్నా అనేక విషయాలను ఆలోచిస్తూ కూర్చుంటే అనేక రకాల ఊహలు పరిగెడుతాయన్నారు.

సామాజిక స్పృహతో ర్రసిందే మంచి రచన అని చెప్తూ దొంగ రచనలు చేయవద్దని ఆయన ఓ సారి అన్నారు. కథకూ, కథానికకూ మధ్య ఉన్న తేడా ఏమిటంటే క్షణానికీ అరక్షణంలో సగానికి ఉండే తేడా అని అన్నారు.
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.