'గతం' సైకలాజికల్‌ థ్రిల్లర్‌

సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ‘గతం’

Gathamపాత జ్ఞాపకాలు చెరిగిపోతే ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారన్న నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘గతం’. కిరణ్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను అడవి శేష్‌ తన ట్విట్టర్‌ ద్వారా విడుదల చేశారు. జస్ట్‌ ఇమాజిన్‌ … లైఫ్‌ రీస్టార్ట్‌ అయితే… అంటూ ఆసక్తికరంగా మొదలైన ‘గతం’ ట్రైలర్‌… ఏ రిలేషన్‌ షిప్‌లోనైనా లైఫ్‌ లాంగ్‌ గుర్తిండిపోయేది మెమెరీస్‌. కానీ మధ్య అవి చెరిగిపోయాయంటూ హీరో హీరోయిన్లు తమకున్న సమస్యను వ్యక్తం చేశారు. భార్గవ పొలుదాసు, రాకేష్‌ గాలెబె, పూజిత కూరపర్తి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీని ఆఫ్‌ బీట్‌ ఫిల్మ్స్‌ అండ్‌ ఎస్‌ ఒరిజినల్స్‌ పతాకాలపై భార్గవ పొలుదాసు, హర్ష ప్రతాప్‌, సృజన్‌ ఎరబోలు నిర్మించారు. పూర్తి స్థాయిలో అమెరికాలో మూడు నెలలపాటు ఎముకలు కొరికే చలిలో షూటింగ్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం నిర్మాణాంత కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి నేపథ్య సంగీతం : శ్రీచరణ్‌ పాకాల, సినిమాటోగ్రఫీ : మనోజ్‌ రెడ్డి, ఎడిటర్‌ : జి.ఎస్‌.

Send a Comment

Your email address will not be published.