గోవిందా హీరోగా...

Govindaగోవిందా హీరోగా విజయ్ మాల్యా బయోపిక్

బ్యాంకులకు కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా జీవితం వెండితెరపైకి రానుంది. సెన్సార్ బోర్డు మాజీ చీఫ్, దర్శకుడు పహ్లజ్ నిహ్లానీ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించారు. మాల్యాగా ప్రముఖ బాలీవుడ్ నటుడు గోవింద నటిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. బ్యాంక్ స్కాంల సన్నివేశాలను వినోదాత్మకంగా తెరకెక్కించామన్నారు.

ఇక ఈ చిత్రంలో కింగ్ ఫిషర్ క్యాలెండర్‌పై ఓ పాటను కూడా కంపోజ్ చేశామని, ఈ పాటకు చిన్ని ప్రకాశ్ కొరియోగ్రఫీ అందించాడని ఆయన వెల్లడించారు. ఇక ఈ చిత్రంలో గోవింద కొత్త అవతారంలో కనిపించనున్నాడని, ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం నచ్చుతుందని పహ్లజ్ అన్నారు. గతంతో పహ్లజ్ నిహ్లానీ, గోవిందతో ‘రంగీలా రాజా’ను తెరకెక్కించారు.

Send a Comment

Your email address will not be published.