గౌతమ్‌ మీనన్‌ - త్రిష

గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో త్రిష

గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ దర్శకత్వంలో త్రిష నటిస్తుందా? అవుననే అంటున్నాయి కోలీవుడ్‌ వర్గాలు. గౌతమ్‌ ఓ లఘు చిత్రం తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ప్రధాన పాత్ర కోసం త్రిషను ఎంపిక చేశారని సమాచారం. మరిన్ని వివరాలు త్వరలోనే రానున్నాయి. గతంలో గౌతమ్‌ దర్శకత్వంలో వచ్చిన రెండు చిత్రాల్లో నటించింది త్రిష. ‘విన్నైతాండి వరువాయ’, ‘ఎన్నై అరిన్‌దల్‌’ సినిమాలు ఘన విజయం అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడుగా తెరకెక్కిస్తున్న ‘ఆచార్య’ నుంచి త్రిష తప్పుకున్న విషయం తెలిసిందే. మణిరత్నం దర్శకత్వంలో ‘పొన్నియన్‌ సెల్వన్‌’ చిత్రంలో నటిస్తుంది.

Send a Comment

Your email address will not be published.