తెలుగు వైభవం

తెలుగు వైభవం

ఆధునిక మానవ జాతి తమ మనోభావాల్ని వెల్లడించేందుకు మాతృ భాష పైనే ఆధారపడుతుంది. నిత్య జీవితంలో వ్యక్తులు ఒకరికొకరు తమతమ సందేశాల్ని అందించటంకోసం ఆ భాషపైనే ఆధారపడతారు. వారి వినికిడికీ,వివరణకూ అది ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఆ సాధనంతోనే తమ ఆలోచనలకు అక్షర రూపం కూడా యిస్తారు. అలాంటి సందేశ ప్రక్రియలకు మూలాధారమే మన మాతృభాష తెలుగు! మన జీవన మూలస్థంభం అయిన ఆ భాష నిర్మలంగా వుండటం మన జీవనావసరం. అందుకోసం మనం ఎంతో ఆదర్శవంతంగా నడుచుకోవాలి. మన ముందు తరాలవారు కూడా ఆ భావననే పెంపొందించేలా కృషి చేయాలి. మన భాషలో మంచి ప్రవేశాన్ని సాధించి ఓ సముచిత స్థాయికి చేరిన వ్యక్తులు నేర్పిన భాషోచ్చారణ, వాక్య నిర్మాణ విధానాలతోనే మన పిల్లల్ని పోషిస్తూ తెలుగు సంస్కృతిని ఓ అత్యున్నత స్థాయికి తీసుకు వెళ్ళాల్సిన బాధ్యత మనందరిపైనా వుంది.   భారత ప్రభుత్వం అధికార పూర్వకంగా గుర్తించిన యిరవయి రెండు భాషల్లో సంస్కృతం, తెలుగు, తమిళం ,కన్నడ భాషలు సాహితీ పరంగా అత్యున్నత స్థానంలో నిలిచివున్నాయి. మిగతా భాషల్లో ఉత్తరాదికి చెందిన హిందీ, పంజాబీ భాషలతో బాటుగా దక్షిణాదికి చెందిన తెలుగు, తమిళ, మలయాళ భాషలు మాత్రమే విదేశాల్లో బహుళ ప్రచారంలో వున్నాయి. అమెరికాలో తెలుగు ప్రభావం అధికంగా వుంది. ఆ ప్రభావం ఆస్ట్రేలియా దాకా చేరి గత పాతికేళ్ళుగా ‘సిడ్నీ’, ‘మెల్బోర్న్’ నగరాలని ప్రభావితం చేసింది. తెలుగు వారు ‘మెల్బోర్న్’ లో కన్నా ‘సిడ్నీలో’ అధికంగా వున్నా ‘సిడ్నీ’ మాత్రం తెలుగు సాహితీ సంస్కృతుల పరంగా కొంచెం వెనుకబడి వుందని చెప్పక తప్పదు. ఆస్ట్రేలియా రాజధాని ‘కాన్బెర్రా’ లోనూ, మరో నగరం ‘పెర్త్’ లోనూ తెలుగు యిపుడిపుడే వెలుగులోకి వస్తోంది. కాని మెల్బోర్న్ లోని తెలుగు వారు మాత్రం తెలుగు సాహితీ సంస్కృతీ రంగాల్లో ఎంతో ప్రగతిని సాధించారు. నగరం నాలుగు దిశల్లోనూ తెలుగు సాంస్కృతిక కేంద్రాలూ, విద్యా సంస్థలూ నియమబద్ధంగా పని చేస్తున్నాయి. మెల్బోర్న్ లోని “ఆస్ట్రేలియా తెలుగు సంఘం” స్థాపించబడి యిరవై ఏళ్ళు గడిచాయి. ఈ యిరవై ఏళ్ళలో సంఘం తరపున తెలుగు వెలుగులు నలుదిక్కులా విస్తారంగా ప్రసరించాయి. నగరం నాలుగు దిశల్లో సంవత్సరం పొడవునా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ బడుతున్నాయి. వారు సదా నిర్వహిస్తోన్న ‘జనరంజని’ కార్యక్రమాలు తెలుగు వారికెంతో మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంటాయి. “అక్షర జ్యోతి ” పేరిట నిర్వహిస్తోన్న నిర్విఘ్న కార్యక్రమం ద్వారా తెలుగు బాల బాలికలకు అక్షర జ్ఞానాన్ని అందచేయబడటం జరుగుతోంది. ఈ కార్యక్రమం స్థానిక తెలుగు జాతికి ఓ వరప్రసాదంలా ఉపయోగపడుతోంది. “ఆస్ట్రేలియా తెలుగు సంఘం” గత రెండుదశాబ్దాలుగా నిర్విఘ్నంగా ప్రచురిస్తోన్న”స్రవంతి” మాసపత్రిక మెల్బోర్న్ లోని తెలుగువారికి ఓ కరదీపికగా కొనసాగుతోంది. ఇవన్నీ అలావుండగా “భువన విజయం ” అను ” తెలుగు సాహితీ సంస్కృతీ సంవేదిక ” గత నాలుగేళ్ళుగా స్థానిక కవులకు, రచయితలకు, నాట్యకళా కారులకు, గాయకులకు ఎంతో ప్రోత్సాహాన్ని అందజేస్తూ వారి వారి కళాత్మక రంగాలకి ఎనలేని సేవల్ని అందిస్తోంది. “భువన విజయం” తో బాటుగా మరో అంతర్జాల వేదిక “మెల్బొతెలుగుసాహితి” MelboTeluguSahithi@yahoogroups.com కూడా గత నాలుగేళ్ళుగా పని చేస్తోంది. ఈ “మెల్బొతెలుగుసాహితి” మెల్బోర్న్ లోని తెలుగు కవులు వ్రాసిన పద్యాలూ,గేయాలు, యితర రచయితలు వ్రాసిన కథలు వ్యాసాలు మొదలగునవి ప్రతి రోజూ వెలువడుతుంటాయి. అదే విధంగా పాఠకుల ఉత్తర ప్రత్యుత్తరాలు కూడా ఈ గ్రూప్ లోనే చోటు చేసుకుని మీకు గోచరిస్తాయి. శ్రీ కొంచాడ మల్లికేశ్వరరావు గారు ఈ గ్రూప్ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నారు. అందుకే సాహిత్యాభిమానులతో బాటుగా మెల్బోర్న్ లోని తెలుగు వారందరూ ఈ “సాహితీ సంస్కృతీ సంవేదిక” గ్రూప్ Mail ID : MelboTeluguSahithi@yahoogroups.com లో మెంబర్లుగా చేరి మన మాతృ భాషా సంస్కృతితో తమకి గల అనుబంధాన్ని నిలబెట్టుకోవాలి ! అలాగే యిపుడు శ్రీ మల్లికేశ్వరరావు గారు సృష్టించిన “వెబ్ సైట్” ని కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ…

మీ

Send a Comment

Your email address will not be published.