నటయోగి నాగయ్య

Bhakta Potana
సుప్రసిద్ధ సినీనటుడు చిత్తూరు నాగయ్య వర్థంతి డిసెంబరు 30

చిత్తూరు నాగయ్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, సంగీతకర్త, గాయకుడు, దర్శకుడు, నిర్మాత. త్యాగయ్య, వేమన, రామదాసు వంటి అనేక పాత్రలు ధరించి చిరస్మరణీయుడయ్యాడు. దక్షిణభారతదేశంలో పద్మశ్రీ పురస్కారం పొందిన తొలినటుడు. తెలుగు సినిమాకే కాకుండా, తమిళ సినిమాకి కూడా ఒక గౌరవాన్నీ, ప్రతిష్ఠనీ కల్పించిన నటుడు నాగయ్య. కేవలం తన నటనతోనూ, వ్యక్తిత్వంతోను ఆ గౌరవం తీసుకురాగలిగారాయన. సభ్యసమాజంలో సినిమానటులంటే చిన్నచూపు వుండేది – తొలిరోజుల్లో నాటకాల వాళ్లకి వున్నట్టు. ఆ చూపును పెద్ద చూపు చేసి సమదృష్టితో చూడగలిగేలా చేసిన మహనీయుడు చిత్తూరు వి.నాగయ్య. మహారాజుల దగ్గరా, విశ్వవిద్యాలయాల్లోనూ, ప్రభుత్వంలో ఉన్నతాధికారుల దగ్గరా నాగయ్యకు విశేష గౌరవాలు లభించాయి. ఈ గౌరవ ప్రతిష్ఠలు ఆయనతోనే ఆరంభమయాయని చెప్పడం అతిశయోక్తి అనిపించుకోదు.

చిన్నప్పటి రోజులు…
చిత్తూరు నాగయ్య 1904, మార్చి 28న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించాడు. నాగయ్య అసలు పేరు ఉప్పలదడియం నాగయ్య. తండ్రి ఉప్పలదడియం రామలింగేశ్వర శర్మ రెవిన్యూ శాఖలో ఉద్యోగిగా వుండేవాడు. తల్లి వేంకట లక్ష్మాంబ. వీరికి నాగయ్య కంటే ముందు నలుగురు పిల్లలు పుట్టి వెంటనే మరణించారు. దాంతో వీరికి జీవితంలో నిరాశ, దిగులు ఏర్పడ్డాయి. ఎవరో ఒకాయన కుటుంబంలో నాగదోషం ఉందని చెప్పగా దోష పరిహారార్థం ఆ దంపతులు సత్తెనపల్లి వెళ్ళి నాగప్రతిష్ట చేసి పూజలు సలిపారు. ఆ తర్వాత జన్మించన కొడుకుకు నాగేశ్వరం అని పేరు పెట్టుకున్నారు. నాగయ్య పూర్వీకులు ఒకప్పుడు యజ్ఞయాగాదులు చేస్తూ ఆస్తిపాస్తులు కలిగిఉండేవారైనా రామలింగ శర్మ తరం వచ్చేటప్పటికి అవన్నీ కరిగిపోయాయి. దాంతో ఆయన చిన్న ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. నాగయ్య రెండేళ్ళ వయసులో ఉండగా చిత్తూరు జిల్లా, కుప్పం సమీపంలోని గోగునూరుకు చెందిన ఆయన అమ్మమ్మ ఆయన్ను చూడ్డానికి వెళ్ళింది. అప్పటికే నాగయ్యకు ఒక తమ్ముడు జన్మించి ఉన్నాడు. అప్పటికే వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు. ఆమె కూతురు కుటుంబం మొత్తం తనతో వచ్చి ఉండమంది. నాగయ్య తండ్రి ఉద్యోగం వదిలి వెళ్ళడానికి అంగీకరించలేదు. దాంతో ఆమె పెద్ద కొడుకైన నాగయ్యను తీసుకు వెళ్ళి పెంచి పెద్ద చేస్తామంది. అయిష్టంగానేనైనా రెండో కొడుకు తమ దగ్గరే ఉండటం వలనా, తమ కొడుకు క్షేమం కోరి అందుకు అంగీకరించారా దంపతులు. దారిలో వస్తున్నపుడే నాగయ్యకు నాగుపాము పడగ పట్టడం చూసిన కొంతమంది ఆయన మహర్జాతకుడు అవుతాడు అని ఊహించి చెప్పారు. అలా నాగయ్య అమ్మమ్మతో పాటు గోగునూరుకి వచ్చాడు. నాగయ్య అవ్వ దగ్గర ఆస్తి పాస్తులు, డబ్బు ఉండేవి. భర్త మరణం తర్వాత ఆమె అమాయకత్వం వల్ల సంపదంతా పరుల పాలైంది. ఆస్తి కోసం తమను బంధువులు ఏమైనా చేస్తారేమోనని భయపడి మనవడిని తీసుకుని కుప్పం వచ్చేసింది. కుప్పంలో ఒక ఇల్లు కొనుక్కుని అందులోనే నివసించసాగింది.

Chittor_V._Nagaiahఅదే సమయానికి నాగయ్య తల్లిదండ్రులు కూడా రేపల్లె నుంచి ఆమె దగ్గర ఉండటానికి వచ్చేశారు. నాగయ్య కుప్పం వీధిబడిలో చేరి 8-9 ఏళ్ళ వరకు అక్కడే చదువుకున్నాడు. దీని తర్వాత కుప్పంలో లోయర్ సెకండరీ స్కూలులో చేరాడు. ఇది జమీందారీ పాఠశాల. తండ్రి దగ్గర పురుష సూక్తం, కొన్ని దేవతార్చన మంత్రాలు నేర్చుకోవడం ప్రారంభించాడు. వేదాధ్యయనంతో బాటు వ్యాయామం కూడా చేసేవాడు. తండ్రి హరికథలు చెప్పేవాడు. సంగీతంలో ప్రవేశం ఉండేది. వయొలిన్ వాయించేవాడు. ఐదో తరగతి దాకా వీరి కుటుంబం కుప్పంలో ఉంది. 1911 లో జీవనోపాధి కోసం వీరి కుటుంబం చిత్తూరుకు తరలి వెళ్ళింది. అప్పుడే చిత్తూరును తమిళ ప్రాంతాలనుండి విడదీసి మండలకేంద్రంగా మార్చారు. చిత్తూరులో వెంకట మునిరెడ్డి అనే ఆసామి ఇంట్లో ఉండేవారు. బోడదేవర పల్లికి చెందిన చెంగమనాయుడు అనే ఆయన కూడా వీరి కుటుంబానికి ఆసరగా ఉండేవాడు. చిత్తూరులో వీరిరువురే కాక మరికొంతమంది పరిచయస్తుల ద్వారా కొన్ని ఇళ్ళలో సంగీత పాఠాలు సాధించగలిగాడు నాగయ్య తండ్రి. ఫస్ట్ ఫారం (ఆరో తరగతి) కోసం చిత్తూరులో బంగారుపాళెం జమీందారు పాఠశాలలో చేరాడు నాగయ్య. పాఠశాల రోజుల నుంచీ నాటకాలు, పాటలు పద్యాలలోనే కాక ఆటల్లో ముఖ్యంగా హాకీ క్రీడలో ఆసక్తి చూపేవాడు.

మూడో ఫారంలో ఉండగా సి. ఎం. దొరై అనే హార్మోనియం రిపేరు చేసే ఆయన పరిచయం ఏర్పడి నెమ్మదిగా వాయించడం ప్రారంభించాడు. నాలుగో ఫారం కోసం బోర్డు హైస్కూలులో చేరాడు. అప్పటికి ఆయన వయస్సు పదమూడేళ్ళు. సంగీతంలో, నాటకాల్లో శ్రద్ధ ఎక్కువైంది. చదువు మీద శ్రద్ధ తగ్గింది. తెలుగు, తమిళ నాటకాలు దొంగతనంగా అయినా సరే వెళ్ళి చూసేవాడు. ఫలితంగా నాలుగో ఫారం తప్పాడు. చదువుకోసం అష్టకష్టాలు పడ్డ తండ్రి చాలా బాధ పడ్డాడు. అది చూసిన నాగయ్యలో కొద్దిగా పరివర్తన వచ్చింది. తర్వాత వెంకట మునిరెడ్డి సిఫారసుతో తిరుమల తిరుపతి దేవస్థానం మహంతు ప్రయాగదాసు ద్వారా దేవస్థానం ఉపకారవేతనం దక్కింది. అలా నాగయ్య నివాసం తిరుపతికి మారింది. చదువుకుంటూ అప్పుడప్పుడూ మిత్రులతో కలిసి తిరుమల వెంకన్న దర్శనం చేసుకునేవాడు. అక్కడ కూడా యాత్రీకుల దగ్గర భక్తి పాటలు పాడేవాడు. తిరుపతిలోని సరస్వతీ విలాస సభ వారు ఈయన్ను వారి సమాజంలో చేర్చుకుని వారు ప్రదర్శించే నాటకాల్లో ఈయనచేత వేషాలు వేయించేవారు. తిరుపతిలోనే నాలుగో ఫారం ఉత్తీర్ణుడై అయిదో ఫారంలో చేరాడు. తిరుపతి పక్కన వడ్డేపల్లి గ్రామంలో నాగయ్య తండ్రికి మొదటి భార్య కూతురు ఉండేది. ఆమె వితంతువు. ఆమెకు బాగా ఆస్తిపాస్తులు ఉండేవి. తండ్రిని ఆమె ఆహ్వానించినా ఆయన వెళ్ళలేదు. ఆమె నాగయ్యను ఆమె గ్రామానికి ఆహ్వానించేది. నాటకాలు, పాటల్లో పడి చదువు మీద శ్రద్ధ సన్నగిల్లడంతో ఐదో ఫారం తప్పాడు. దాంతో దేవస్థానం ఇస్తున్న ఉపకార వేతనం రద్దై పోయింది.

చిత్తూరుకు చెందిన రామవిలాస సభ వారు నిర్వహించిన “సారంగధర” నాటకంలో “చిత్రాంగి” వేషం ద్వారా ప్రశంసలు అందుకొని “చిత్తూరు నాగయ్య”గా ప్రసిద్ధులయ్యాడు. చిన్నప్పటినుండి భాగవత, భారతాల పట్ల అమితమైన ఆసక్తి నాగయ్యకు. తండ్రి చక్కని సంగీత విద్వాంసుడు, పండితుడు. తండ్రి సంగీత కళాభిజ్ఞత కొడుకుని బాల్యంలోనే ఆకర్షించింది.

నాన్న చూపిన దారిలో
తండ్రి శిక్షణలో సంగీత సాధన ప్రారంభించాడు. పాఠశాలకు వెళ్ళడం కంటే సంగీత కచ్చేరీలకు వెళ్ళటం ఎంతో సరదాగా వుండేది బాల నాగయ్యకు. దూరంగా వున్న ఒక వూళ్ళో సంగీత కచ్చేరి జరుగనున్న విషయం విన్నాడు. ఇంట్లో మాట మాత్రం చెప్పక తన చెవి పోగుల్ని అమ్మి ఆ డబ్బుతో రైలు టిక్కెట్ కొని సంగీత కచ్చేరి విని ఇంటికి తిరిగి వచ్చాడు. కొడుకు సంగీతాభిరుచిని గుర్తించిన తండ్రి, కుమారుణ్ణి సంగీత విద్యాభ్యాసం కొరకు సంగీత విద్వాన్ చిత్తూరు పేరయ్య పిళ్ళె వద్దకు పంపాడు. ఒకమారు మహా విద్వాంసులైన పుష్పవనం అయ్యర్, గోవిందస్వామి పిళ్ళె గార్ల సంగీత కచ్చేరీకి నాగయ్య హాజరయ్యాడు. కచ్చేరి పూర్తి అయ్యింది. శ్రోతలందరు వెళ్ళి పోయారు. నాగయ్య మాత్రం అలాగే నిల్చుని పుష్పవనం అయ్యర్ వంక అదే పనిగా చూడసాగాడు. అయ్యర్, ” ఏం అబ్బాయ్, ఏం కావాలి? నీ పేరేమి?” అని ప్రశ్నించాడు. నా పేరు ‘ప్రహ్లాదుడు’ అని జవాబిచ్చాడు బాలుడు. ‘సరే కాని, నీకేమైనా సంగీతం వచ్చా’ అని అడిగాడు. ‘ఓ-వినండి’ అంటూ భాగవతంలోని ప్రహ్లాదుని పద్యాలను మధురంగా భావయుక్తంగా పాడాడు. గోవింద స్వామి పిళ్ళె ఆనందంగా వయోలిన్ వాయించాడు. రెండు గంటలసేపు పద్యాలు పాడాడు. అయ్యర్ ఆనంద పరవశుడై ‘బాబు, నీవు గొప్ప కళాకారుడవుతావు’ అని ఆశీర్వదించాడు. ఈ సంఘటనను పలుమార్లు మిత్రులకు చెప్పేవాడు నాగయ్య.

కంచిలో నయన పిళ్ళే వద్ద, కుంభకోణంలో సంగీత కళానిధి మహారాజపురం విశ్వనాధ అయ్యర్ వద్ద సంగీత విద్యాభ్యాసం సాగించాడు నాగయ్య. చిత్తూరులో మద్రాసు ప్రెసిడెన్సి కాలేజీలో అతని చదువు కొంతవరకు సాగింది. మనసంతా సంగీతంపై వున్నపుడు కాలేజీలో చదవటం ఎలా సాగుతుంది? కాలేజీ చదువు అర్ధంతరంగా ముగిసింది. విద్యార్థిగా నాటకాల్లో వేషాలు వేసి ప్రశంసలందుకొన్నాడు. కర్ణాటక సంగీతంలోనే కాక, హిందుస్తానీ సంగీతంలో కూడా దిట్ట నాగయ్య.

Mooga Nomu

తండ్రి మరణించిన తర్వాత నాగయ్యకు జీవితంలో కష్టాలెదురైనాయి. మొదటి భార్య ప్రసవించిన తర్వాత తల్లి, బిడ్డ చనిపోయారు. రెండవ భార్య ఆయనకు దూరమైంది. మనశ్శాంతి లేని నాగయ్య రమణ మహర్షి ఆశ్రమంలో కొంతకాలం గడిపాడు. పుణ్యక్షేత్రాలు చూశాడు. మరలా చిత్తూరు చేరాడు. మద్రాసులో చదువుకు ‘గుడ్ బై’ చెప్పిన నాగయ్య చిత్తూరు జిల్లా బోర్డు ఆఫీసులో గుమస్తాగా చేరాడు. స్థానిక రామ విలాస సభ నాటక సంఘం వారితో పరిచయం లభించింది.
1932 లో జాతీయ కాంగ్రెస్ లో స్వయం సేవకుడుగా చేరి మద్రాసు వెళ్ళాడు. ప్రకాశం పంతులు, సత్యమూర్తి, రాజాజీ మున్నగు నాయకుల పరిచయం కలిగింది. గుమస్తా ఉద్యోగానికి రాజీనామా యిచ్చాడు. లాఠీ చార్జీలు, లాకప్ లు చవిచూశాడు. వార్దాకు వెళ్ళి గాంధీజీని దర్శించాడు. తిరిగి మద్రాసు వచ్చాడు. రాజకీయరంగం వదలి మరలా కళారంగంలో అడుగు పెట్టాడు. ఫిల్ము కంపెనీలు పెడతామని కొందరు ప్రలోభపెట్టి నాగయ్యను వంచించారు.

చేత చిల్లిగవ్వలేక మద్రాసు వీధుల్లో తిరుగుతూ, ఆకలి బాధతో నుంగంబాకంలో క్రింద పడిపోయాడు. దారిన పోతున్న హచ్చిన్స్ కంపెనీ యజమాని, నాగయ్య పాత మిత్రుడు అయిన అచ్యుతనాయుడు నాగయ్యను గుర్తుపట్టి భోజన వసతులు కల్పించాడు. నాయుడుగారి ప్రోత్సాహంతొ నాగయ్య ఎన్నో గ్రాంఫోను రికార్డులిచ్చాడు. “హిజ్ మాస్టర్స్ వాయిస్” కంపెనీ వారు నాగయ్య కంఠ మాధుర్యానికి ముగ్ధులై తమ కంపెనీలో మ్యూజిక్ డైరెక్టర్ గా నియమించుకొన్నారు. నాగయ్య పాడిన రికార్డులు విపరీతంగా అమ్ముడుపోయాయి.

బి. ఎన్. రెడ్డి తో పరిచయం
1935 లో బి. ఎన్. రెడ్డి గారిని నాగయ్య కలుసుకొన్నాడు వెంటనే రెడ్డిగారు తమ మిత్రులైన హెచ్.ఎమ్. రెడ్డికి నాగయ్యను పరిచయం చేశారు. హెచ్. ఎం. రెడ్డి నాగయ్య కంఠ మాధుర్యానికి పరవశుడయ్యాడు. తాను తీసే “గృహలక్ష్మి” చిత్రంలో సంఘ సేవకుని పాత్ర యిచ్చాడు. ఆ వేషంలో నాగయ్య పాడిన, “కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్” అన్న పాట ఆంధ్రదేశమంతటా ప్రతిధ్వనించింది. అప్పట్లో మద్యపాన నిషేధం అమలులో వుండేది కాన ఆ పాటకు జనాదరణ అమితంగా లభించింది.

నాటకరంగంలో
నాగయ్య చిత్తూరులో ఉండగా సురభి నాటక మండలి వారు భక్త ప్రహ్లాద నాటకం ప్రదర్శించడానికి వచ్చారు. అయితే ఆ నాటకంలో ప్రహ్లాదుడి వేషం వేయవలసిన అబ్బాయికి జ్వరం రావడంతో నాగయ్య తొలిసారిగా నాటకంలో ప్రహ్లాదుడి వేషం వేశాడు. ఆ అర్థరాత్రి నాటకంలో మొదట వేదిక ముందున్న జనవాహినిని చూసి భయపడి ఏడ్చేసినా తర్వాత సర్దుకుని మళ్ళీ పద్యాలు, పాటలు ఆలపించాడు. ప్రేక్షకులు, బంధువులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు. ఇది విన్న పాఠశాల పంతుళ్ళు కూడా నాగయ్యను ప్రత్యేకంగా స్కూల్లో కూడా ప్రహ్లాదుడి వేషం వేసి పాటలు, పద్యాలు పాడించి ఆనందించారు. తర్వాత స్కూల్లోనూ, ఉత్సవాల్లోనూ అప్పుడప్పుడూ వేదికలెక్కి పాటలు పాడుతుండటంతో నటన భాగా అనుభవంలోకి వచ్చింది. చిత్తూరులో రామ విలాస సభ, లక్ష్మీ విలాస సభ, మద్రాసులో సుగుణ విలాస సభ, ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ మున్నగు నాటక సంస్థలు ప్రదర్శించిన నాటకాలలో, మొదట సావిత్రి, దమయంతి, చిత్రాంగి వేషాలు ధరించి ప్రశంస లందుకొన్నాడు. నాటకరంగ ప్రవేశంతో మహానటులైన బళ్ళారి రాఘవ, పర్వతనేని రామచంద్రా రెడ్డి మొదలగు వారితో కలిసి పలు నాటకాలలో అభినయించాడు. రామదాసులో కబీరు వేషధారిగా కహో రామ్‌ నామ్‌ అంటూ పాడుతూ రంగ ప్రవేశం చేయటంతోనే ప్రేక్షకుల కరతాళ ధ్వనులతో నాటక మందిరం మార్మోగింది. దేశోద్ధారక కాశీనాధుని నాగేశ్వరరావు నాగయ్య నటనా కౌశలాన్ని మెచ్చుకొని బంగారు పతకంతో పాటు ‘రంగ భూషణ’ బిరుదంతో సత్కరించారు.

సినీరంగ ప్రవేశం
Vemana1938లో హెచ్.ఎమ్.రెడ్డి చిత్రం గృహలక్ష్మితో నాగయ్య సినీ ప్రస్థానం ప్రారంభమైంది. చిత్తూరులో పత్రికా విలేకరిగా వుంటూ, నాటకాల్లో నటిస్తూ గ్రామఫోన్ రికార్డులు ఇస్తూ కాలక్షేపం చేస్తున్న నాగయ్యను సినిమారంగం ఆహ్వానించింది. ఆ రోజుల్లో పర్సనాలిటీ ఎలావుందని ఎవరూ చూసేవారు కాదు. ‘పాటా పద్యం వచ్చునా – ఒకే!’ అన్న రోజులు. రంగస్థలం మీద సంభాషణ చెప్పడంలో కూడా కొత్త విధానాన్ని చూపించారనీ, ఉచ్చారణ స్పష్టంగా వున్నదనీ నాగయ్యను హెచ్.ఎం.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, గృహలక్ష్మి (1938) చిత్రములో నటించడానికి పిలిచారు. అందులో ఈయన ఒక దేశభక్తుడి పాత్ర పోషించాడు. గృహలక్షిలో నాగయ్య పాడిన పాటలు ప్రాచుర్యం పొందాయి. తొలిచిత్రంతోనే చిత్తూరు వి.నాగయ్య మంచి నటుడు అనిపించుకున్నాడు.

1939లో బి.యన్.రెడ్డి వందేమాతరం చిత్రంలో నాగయ్యకు కథానాయకుని పాత్ర లభించింది. అదే చిత్రంలో నాగయ్య సంగీతాన్ని కూడా కూర్చారు. వెంటనే ‘సుమంగళి (1940) లో వృద్ధపాత్ర ధరించారాయన. images1తర్వాతి చిత్రం దేవత (1941) లో హీరోయే. ఈ సినిమాలన్నీ తమిళనాడులో కూడా బాగా నడవడంతో, నాగయ్యకు తమిళ చిత్రాల్లో కుడా మంచి అవకాశా లొచ్చాయి. తమిళభాషను ఆయన క్షుణ్ణంగా నేర్చుకున్నారు. గ్రాంథికభాష కూడా అలవరుచున్నారు. స్వర్గసీమ (1945) ఒక ఉదాహరణ. భక్త పోతన (1942), త్యాగయ్య (1946), యోగి వేమన (1947) చిత్రాలు నాగయ్య జీవితాన్ని పూర్తిగా మార్చివేశాయి. ఆ పాత్రల ప్రభావం ఆయన మీద బాగా పడింది.
1938 నాటి గృహలక్ష్మి సినిమాలో నాగయ్య పాడిన కల్లు మానండోయ్ పాట మంచి ప్రాచుర్యాన్ని పొందింది. 1938-1973 మధ్య నాగయ్య 200 కు పైగా తెలుగు, తమిళ సినిమాలలో నటించారు. సుమంగళి, భక్త పోతన, రామదాసు, యోగివేమన, త్యాగయ్య ఆయన నటించిన కొన్ని విశేష చిత్రాలు. అప్పట్లో నాగయ్య అత్యధిక పారితోషికం తీసుకొనే నటుడుగా పేరుపొందారు.

గాయకుడు…సంగీత దర్శకుడుగా
నాగయ్య మంచి గాయకుడు, సంగీత దర్శకుడు కూడాను. స్వర్గసీమ సినిమాకు నేపథ్యగాయకునిగా ఘంటసాలను పరిచయం చేశారు. త్యాగయ్య సినిమా చూసి మైసూరు మహారాజా నాగయ్యను 101 బంగారు నాణేలు, ఒక కంఠాభరణంతో సత్కరించారు. దక్షిణభారతంలో ‘పద్మశ్రీ’ పురస్కారం పొందిన తొలినటుడూ నాగయ్యే. ‘అదేదో నా ఘనత కాదు. నాకే వచ్చిన ప్రశంస కాదు. ఇదినటులందరిదీ!’ అని చెప్పేవారు నాగయ్య. బాబూరావు పటేల్ తన ‘ఫిల్మిండియా’ పత్రికలో ‘మనదేశంలోనూ ఒక పాల్ ముని వున్నాడు’ అని నాగయ్యను ప్రస్తుతించాడు.

దర్శకత్వంలో…
CNagaiahదర్శకుడుగా త్యాగయ్య ఆయన తొలిచిత్రం. త్యాగయ్య సినిమాను ఆయనే నిర్మించి, దర్శకత్వము చేశారు. నాయిల్లు (1953), భక్త రామదాసు (1964) చిత్రాలూ డైరెక్టు చేశారు – నిర్మాతగా కూడా వ్యవహరిస్తూ. కొంతకాలం క్రితం మద్రాసులో నాగయ్య స్మారకదినోత్సవం జరిగితే, ‘త్యాగయ్య’ ప్రదర్శించారు. ఆ చిత్రం చూసిన ప్రసిద్ధ దర్శకుడు కె.విశ్వనాథ్ “ఈ చిత్రంలోని ప్రతి అంశం ఎంతో కళాత్మకంగానూ, ఉన్నతంగానూ ఉన్నాయి. ఆయన తీసిన కొన్ని షాట్స్ నాలాంటి దర్శకుల ఊహకు అందనివి” అని కీర్తించారు. ‘త్యాగయ్య సినిమాలోని ‘ఎందరో మహానుభావులూ’ పాట విన్న ప్రసిద్ధ గాయకుడు జేసుదాసు “త్యాగరాజు ఎలా పాడివుంటారో, నాగయ్యపాట విన్నాక, ఊహించుకోవచ్చును. త్యాగరాజ సంప్రదాయాన్ని పాటిస్తూ, ఆ కృతిని అంత భక్తిశ్రద్ధలతో ఇంకొకరు పాడగలరా అని అనిపిస్తుంది” అని చెప్పారు. ఆ చిత్రంలోని ఆయన గానామృతానికి పరవశించి, మైసూరు మహారాజా, తిరువాస్కూర్ మహారాజా, నాగయ్యను ఘనంగా సత్కరించారు. తిరువాస్కూరు రాజావారు, ఏకంగా తన సింహాసనం మీదనే కూర్చోబెట్టారు.

మైసూరు మహారాజా గారి సన్మానం అందుకున్న నాగయ్య గారి ‘‘త్యాగయ్య’’ (1946) నటుడుగా, దర్శకుడిగా, నాగయ్య జీవితంలో ఓ మైలురాయిలా నిలిచిపోతుంది. మైసూరు మహారాజా తన రాజభవనంలో ‘‘త్యాగయ్య’’ చిత్ర ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయించుకుని నాగయ్యను వెండి శాలువాతోనూ, 101 బంగారు నాణాలతోనూ సత్కరించాడు. శ్రీరామచంద్రుడి బొమ్మ ఉన్న ఒక బంగారు నెక్లెస్‌ను కూడా బహూకరించాడు. నాగయ్య స్వయంగా రేణుకా ఫిల్మ్స్ అనే సంస్థను ప్రారంభించి త్యాగయ్య చిత్రాన్ని నిర్మించి చరిత్ర సృష్టించాడు. ఆ చిత్రం ప్రారంభించడానికి ముందు తిరువాయార్ లోని త్యాగరాజుల వారి సమాధి వద్ద కొన్ని రోజులు ఉపవాస దీక్ష చేశాడు. ‘త్యాగయ్య’ చిత్రంలో నాయకుడుగా సంగీత దర్శకుడుగా అఖండ కీర్తినార్జించాడు. త్యాగయ్య చిత్రం యునెస్కో ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించబడి భారతదేశ కీర్తి పతాకను ఎగుర వేసింది.

సినీనిర్మాతగా
తరువాత భాగ్యలక్ష్మి సినిమాతో చిత్రనిర్మాణంలోకి దిగారు. రామదాసు సినిమాలో ఆయన బాగా నష్టపోయారు. సినిమా నిర్మాణంలోను, దాన ధర్మాలతో ‘రామదాసు’ చిత్రం సమయానికి ఆయన ఆస్తులు తరిగిపోయాయి. రామదాసు సినిమా తీస్తున్నప్పుడు, రామదాసు పడిన కష్టాలన్నీ నాగయ్య అనుభవించాడు. చిత్రం పూర్తి కావడానికి చాలాకాలం పట్టింది.

ప్రశాంత వ్యక్తిత్వం
Vagdhanam

ఆయన మాటతీరూ, చిరునవ్వూ అన్నీ శాంతం ఉట్టిపడుతూ వుండేవి. ఎవరి మీదా ఈర్ష్యాద్వేషాలూ, కోపతాపాలూ వుండేవి కావు. పోతన – తన దగ్గర లేకపోయినా, ఉన్నదేదో దానం చేసినట్టు, – నాగయ్య కూడా దానాలు చేసి చేసి, ఆస్తులన్నీ హరింప జేశారు. కొందర్ని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. ‘త్యాగయ్య తీస్తున్నప్పుడు వారి రేణుకా ఆఫీసు ధర్మసత్రంలా వుండేదని చెప్పుకుంటారు. చిన్న చిన్న వేషాలు వేసేవాళ్లూ, చిన్న టెక్నీషియన్లూ, అక్కడే బసా, భోజనాలూ! ‘పొట్టిప్లీడరు (1966) సినిమా తీస్తున్నప్పుడు పద్మనాభం ఆయనతో మాటల సందర్భంగా చెప్పారు తను కూడా ‘రేణుక’ ఆఫీసులో కొంతకాలం వున్నానని. దానికాయన ఎంతో స్పందించి, ‘అలాగా నాయనా! నీకు అప్పుడు ఏ లోపం జరగలేదు గదా, నువ్వెవరో నాకు తెలియకపోయెనే!’ అని అన్నారు.
అవుట్ డోర్ షూటింగులకి వెళ్తే, మధ్యాహ్నం భోజనసమయంలో షూటింగు చూడవచ్చిన జనానికి భోజనం పెట్టమనేవారు నాగయ్య. ‘వాళ్లు కూడా పొద్దున నుంచి మనతోపాటే ఇక్కడ వున్నారుగదా!’ అన్నది ఆయన సమాధానం. మద్రాసులో స్కూళ్లూ, కాలేజీలూ తెరిచే రోజుల్లో ఆయన ఇంటిముందు విపరీతంగా జనం గుమిగూడేవారు – ఆయన లేఖలురాసి ఇస్తే కాలేజీ, హైస్కూళ్లలో సీట్లు దొరకడం సులభయయేది.

సన్మానాలు
1965 లో భారత ప్రభుత్వం అతనికి పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. దక్షిణ భారత సినిమారంగంలో పద్మశ్రీ అందుకొన్న మొదటి నటుడు నాగయ్య. “ఫిల్మ్‌ ఇండియా” సంపాదకుడు నాగయ్య నటనా వైదుష్యాన్ని వేనోళ్ళ కొనియాడుతూ, నాగయ్యను ‘ఆంధ్రా పాల్‌ముని’ గా కీర్తించాడు. నాలుగు దశాబ్దాల సినిమా జీవితంలో నాగయ్య 200 తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లోను, 160 తమిళ చిత్రాల్లోను నటించాడు.

మహాదాత
piya-milan-nagaiahనాగయ్య మహానటుడే కాదు, మహాదాత. ఎన్నో దాన ధర్మాలు చేశాడు. ఆంధ్రరాష్ట్ర అవతరణ సందర్భంలో, నాగయ్య 20 వేల రూపాయలు అప్పుగా తెచ్చి ఆంధ్రకేసరికి విరాళంగా సమర్పించాడు. ఒకమారు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మద్రాసు వచ్చారు. ఆయన దర్శనం కోసం నాగయ్య, గుమ్మడి మరో మిత్రుడు వారి దగ్గరకు వెళ్ళారు. నాగయ్య గారు వచ్చారని విన్న రాధాకృష్ణన్ స్వయంగా వచ్చి నాగయ్యను ఆహ్వానించారు. నాగయ్యతో పాటు వచ్చిన మూడోవ్యక్తి, రాధాకృష్ణన్ గారికి పాదాభివందనం చేస్తే “మావంటి వారికి పాదాభివందనం ఎందుకయ్యా? మీ ప్రక్కనే వున్న నాగయ్యగారికి చేస్తే మీకు పుణ్యం వస్తుంది” అన్నారు రాధాకృష్ణన్.

చివరి రోజుల్లో
చివరి రోజులలో నాగయ్య పేదరికాన్ని అనుభవించారు. కేవలం వందల రూపాయలకు చిన్న చిన్న వేషాలు వేశారు. తెలుగు సినీరంగములో ఒకదశలో అత్యధిక పారితోషికం తీసుకున్న నాగయ్య, ఆ తరువాత దశలో ఉదరపోషణకు చిన్న వేషాలు వేస్తూ అల్ప పారితోషికాలూ అందుకున్నారు. నా జీవితం అందరికీ ఒక పాఠం. తనకు మాలిన ధర్మం చెయ్యకండి. అపాత్రదానాలు చెయ్యకండి. ఎందరో గోముఖవ్యాఘ్రాలు వుంటారు. అందర్నీ నమ్మకండి! అని చెప్పేవారు – “నేను ఎన్నోసార్లు మోసపోతున్నాను. అందరి మాటా నమ్ముతాను. అందర్నీ విశ్వసిస్తాను! అదే నా అర్థిక పతనానికి కారణమైంది” అని తన ఆత్మకథలో వ్రాసుకొన్నాడాయన. ఇళ్లు అన్నీ పోయి అద్దె ఇంట్లో వున్నప్పుడు! మద్రాసు పానగల్ పార్కులోని ఆయన విగ్రహం, వాణీ మహాల్ ఆడిటోరియం, ఆయన చలనచిత్ర ఉదాత్తపాత్రలూ ఆయన ఘనతను మనకు అనునిత్యం గుర్తుకు తెస్తూవుంటాయి.

“రఘుపతి రాజారాం” గీతాన్ని వింటూ తుది శ్వాస
నాగయ్య చివరిదశలో మూత్రసంబంధమైన వ్యాధికి గురై అడయార్ లోని వి.హెచ్.ఎస్. సెంటర్ లో చేర్చబడ్డాడు. మృత్యుదేవతతో పోరాడుతున్న నాగయ్య వద్దకు అతని మిత్రులు ముదిగొండ లింగమూర్తి, ఇంటూరి వెంకటేశ్వరరావు అతని శయ్యవద్ద నిల్చి “రఘుపతి రాజారాం” గీతం పాడుతుండగా వింటూ నాగయ్య 1973 డిసెంబరు 30వ తేదీన కన్నుమూశాడు. తెలుగు సినిమా నటీనటుల విరాళాలతో ఆయన అంత్యక్రియలు జరిగాయి. డా. ఇంటూరి వెంకటేశ్వరరావు గారు, మిత్రులు అభిమానులు మున్నగు వారి సహకారంతో మద్రాసు త్యాగరాయ నగర్ లోని పానగల్ పార్కులో, ఈశాన్య భాగంలో ‘నటయోగి నాగయ్య’ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠింపచేయగా రాష్ట్రపతి వి.వి.గిరి ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటేటా ఆ విగ్రహం వద్ద డిసెంబరు 30వ తేదీన నాగయ్య వర్ధంతి జరుపుకుంటూ ఆ మహానటునికి జోహార్లు అర్పిస్తున్నారు.

Send a Comment

Your email address will not be published.