నాటకాల వేదికల ఏర్పాటు

నాటకాల వేదికల ఏర్పాటు

ఇంగ్లాండ్ లో మొట్టమొదటి నాటక వేదిక 1576 లో నిర్మించారు. ఇంగ్లాండ్ రాజధాని లండన్ శివారులో ఈ వేదికను ఏర్పాటు చేశారు. ఈ శతాబ్దంలోనే తేమ్స్ నదికి ఉత్తర, దక్షిణ ప్రాంతాలలో మొత్తం ఎనిమిది నాటక వేదికలు నిర్మించారు. అప్పట్లో లండన్ నగర జనాభా రెండు లక్షల వరకు ఉండేది. అంతమని జనాభాకు ఇన్ని నాటక వేదికలు ఉండటం విశేషమే. దీనిని బట్టి నాటకాలను ప్రజలు ఎంతగా ఆదరించేవారో తెలుసుకోవచ్చు. ఆ రోజుల్లో రాత్రి వేళల్లో దీపాలు అమర్చడానికి తగిన సౌకర్యాలు లేకపోవడంతో నాటకాలను పగటి పూటే ప్రదర్శించే వారు. నాటకాలకు ఏర్పాటు చేసిన వేదికలు వలయాకారంలో ఉండేవి. అలాగే కొన్ని ఆరో మూలాలతో కూడినవిగా ఉండేవి. నాటకాలు చూడటానికి రెండు మూడు గ్యాలరీలు ఉండేవి. ఈ గ్యాలరీలకు, వేదికకు మధ్యలో వొట్టి నేల ఉండేది.

ఇక వేదిక విషయానికి వస్తే, స్టేజ్ మీద ఒక బల్ల, కుర్చీలు, రెండు మూడు పూల మొక్కల తోటలు ఉండేవి. అంతే తప్ప స్టేజ్ మీద ఎక్కువగా వస్తువులు ఉండేవి కావు. కొన్ని సందర్భాల్లో నాటకంలోని సన్నివేశాల కాలాన్ని చెప్పడానికి స్టేజ్ మీద అట్ట ముక్కాలా మీద రాసి ప్రేక్షకులు చదవడానికి వీలుగా ఉంచే వారు.

ఇలా ఉండగా, ప్రముఖ రచయిత షేక్ స్పియర్ మొట్ట మొదట ఒక నాటక సమాజంలో చేరారు. మొదట్లో ఈ నాటక సమాజానికి వెస్ టర్ ప్రభువు పోశాకులుగా ఉండేవారు. ప్రధమ జేమ్స్ రాజ్యానికి వచ్చిన తర్వాత అది రాజు గారి నాటక సమాజంగా మారిపోయింది. 1599 లో ఈ సమాజం వారు గ్లోబ్ నాటక శాలను నిర్మించారు.

షేక్ స్పియర్ రాసిన 37 నాటకాలూ ఒక్కో విశిష్ట కళా సృష్టి. మొదట్లో ఆయన నాటకాలను ఆయన పేరుతో ప్రదర్శించలేదు. కాలం సాగే కొద్దీ ఆయన పేరుతో నాటకాలు ప్రదర్శించారు.

– ప్రేమీ

Send a Comment

Your email address will not be published.