నాలుగేళ్ళలో నింగికెగసిన తెలంగాణ

సవాళ్ళని అధిగమిస్తూ సంక్షేమం దిశగా బంగారు తెలంగాణా

kcr 1000

నాలుగేళ్ల కిందటే ఎర్పడిన కొత్త రాష్ట్రం తెలంగాణ. సరిగ్గా ఇదే రోజు (జూన్2) న దేశ చరిత్రలోనే సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఈ నాలుగేళ్ళలో కొన్నికొన్ని చిన్న వైఫల్యాలున్నా ఎక్కువశాతం మాత్రం అన్ని రంగాల్లో సంక్షేమానికే పెద్దపీట వేసింది.

ముందుగా విద్యా రంగంలో చూస్తే……..
రెసిడెన్షియల్ స్కూళ్ళు రేపటి బంగారు తెలంగాణ నిర్మాణంలో ఒక గొప్ప మలుపు. గత సంవత్సరం ప్రారంభమైన 119 నియోజకవర్గాలకు ఒకటి చొప్పున 119 మహాత్మా జ్యోతిబా ఫూలే రెసిడెన్షియల్ స్కూల్స్‌లో విద్యాప్రమాణాలు గొప్పగా ఉన్నాయి. ఎంతోకాలంగా కొనసాగుతున్న రెసిడెన్షియల్ స్కూల్స్‌తో పోటీపడుతున్నాయి. 10వ తరగతి ఉత్తీర్ణత విషయంలో మిగతా రెసిడెన్షియల్ స్కూళ్ళ కన్నా ఒకింత పైచేయి సాధించడం విశేషం. గత ఏడాదంతా గెస్ట్ టీచర్స్‌తో నడిచిన 119 రెసిడెన్షియల్ బాలబాలికల పాఠశాలలు అనేక ఉన్నత ప్రమాణాలను అం దుకోవడం ఒక గొప్ప విజయం. అందుకు గెస్ట్ టీచర్లు, ప్రిన్సిపల్స్, స్పెషల్ ఆఫీసర్లు, ప్రభుత్వ ఉన్నతాధికారుల అకుంఠితదీక్ష, చిత్తశుద్ధి మరువలేనిది. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9.30 దాకా విద్యార్థినీ విద్యార్థులను కంటికిరెప్పలా కాపాడుకుంటూ అత్యున్నత ప్రమాణాల పోషకాహార విలువలతో కూడిన ఆహారం, పరిసరాలు, పరిశుభ్రత, ప్రశాంత వాతావరణం, ఆటపాటలు, అనేకరంగాల్లో సృజనాత్మకత వెలికితీయడం, నైపుణ్యాల వికాసం సాధించడంలో ఈ పాఠశాలలు కొత్త రికార్డులను నెలకొల్పాయి. ఎన్నో ఏండ్ల కృషితో సోషల్ వెల్ఫే ర్ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా నెలకొల్పిన ఉన్నత ప్రమాణాలను ఒకే ఏడాదికాలంలో సాధించడం చిన్న విషయమేమీ కాదు. తొలితరంనుంచి విద్యావంతులుగా ఎదుగడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ గొప్ప అవకాశాన్ని అందించాయి. తల్లిదండ్రులు ఎంతో పేద లు, అక్షరాస్యత తక్కువ. కూలీ నాలీ చేసుకొని, కులవృత్తి చేసుకొని, చిన్న వృత్తులు చేసుకొని బతుకుతున్న బడుగు బలహీన వర్గాల పిల్లలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఒక గొప్ప ఆశాకిర ణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే తీసుకున్న అనేక నిర్ణయాల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు కూడా ఒకటి. ఇది భవిష్యత్ నిర్మాణానికి సంబంధించినది.

1972లో పీవీ చొరవతో ప్రారంభమైన మూడు రెసిడెన్షియల్ స్కూళ్ల తో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ల చరిత్ర ప్రారంభమైం ది. అంతకుముందు సంపన్నులను, వారి పిల్లలను తీర్చిదిద్దడానికి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వంటివి వందేండ్ల క్రితమే నైజాం రాజ్యంలో ఉన్న త ప్రమాణాలతో నడిచాయి. ఆ తర్వాత రెసిడెన్షియల్ స్కూళ్లు, ప్రభుత్వ హయాంలో కొన్ని ప్రారంభమై ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులను అనేక రంగాల్లో ఎదిగించాయి. అధ్యాపకులుగా, జర్నలిస్టులుగా, ఐఏఎ స్ అధికారులుగా, సైంటిస్టులుగా, అడ్వొకేట్లుగా, ఉన్నతాధికారులుగా, ప్రజాప్రతినిధులుగా అనేకరంగాల్లో ఎదిగారు. అయితే ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణ ప్రాంతంలో మొత్తం కలిసి 23 రెసిడెన్షియల్ పాఠశాలలే ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారీగా మొత్తం కలిసి 560కి పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి. లక్షలాదిమంది పేద బాలబాలికలు వీటిలో ప్రవేశానికి ఉవ్విళ్ళూరుతున్నారు. ఇంకా 119 రెసిడెన్షియల్ పాఠశాలలు పెడుతామని ప్రభుత్వం అంటున్నది. వాటిగురించి ఎప్పుడెప్పుడా అని లక్షలాది పిల్లలు, తల్లిదండ్రులు కళ్ళల్లో ఆశాదీపాలతో ఎదురుచూస్తున్నారు. తమ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని భావించడమే అందుకు కారణం. ప్రతి విద్యార్థిపై ఏటా ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చుచేస్తున్న ప్రభుత్వం ఉన్నత ప్రమాణాలు నెలకొల్పడంలో అడుగడుగునా నిర్ణయాత్మకంగా ప్రోత్సహిస్తున్నది.

జనం ముందుకు సంక్షేమం
Telangana party

రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షే మ పథకాలు గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలను ఆశ్చర్యకరంగా పెంచాయి. సామాజిక పెట్టుబడి విధానాలైన రైతుబంధు, గొర్రెల పెంపకం, చేపల పెంపకం, చేనేత సహాయ పథకం, వివిధ వృత్తుల సహాయ పథకాల వలన డబ్బు ప్రజలకు చేరి సామాజిక పునఃనిర్మాణం జరుగుతున్నది. మౌలిక సదుపాయాలు కల్పించే రోడ్ల నిర్మాణం, రెండుగదుల ఇండ్లు, మిషన్ బగీరథ, మిషన్ కాకతీయ, ఎత్తిపోతల పథకాలు వేల కోట్ల రూపాయలను ప్రజలకు అంద జేస్తున్నాయి. ఉచిత కరెంట్, పునరుద్ధరింపబడిన చెరువులు, ఎత్తిపోతల పథ కం ద్వారా వేలాది ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చి గ్రామాలు కళకళాడుతున్నాయి.
గతంలో తెలంగాణ రైతుల పరిస్థితి మాత్రం పూర్తిగా సంక్షోభంలో ఉండేది. పరిమితమైన నీటివనరులతో, పెట్టుబడి లేమితో, అధిక భూమి శిస్తుతో రైతులు నిజాం సంపదను పెంచడానికే బతికారు. నిజాం ప్రభుత్వం 1929లో కేశవ అయ్యంగార్ నాయకత్వంలో ఆర్థిక పరిస్థితిని అంచనా వేయడానికి ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీ రైతుల దీనస్థితిని క్షుణ్ణంగా వివరిస్తూ 54 శాతం ప్రజలు తీవ్ర అప్పు ల్లో కూరుకుపోయారని, యాభై శాతం వరకు ఉన్న వడ్డీ రేటు భరింపరానిది గా ఉన్నదని, కొన్ని అప్పులు తరతరాలుగా కొనసాగుతూ రైతులకు గుది బం డగా మారాయని పేర్కొన్నది. అప్పులు చేయడానికి ప్రధాన కారణాల్లో భూమి శిస్తు ఒకటని కూడా కమిటీ పేర్కొన్నది. తెలంగాణలో సంపన్నమైన ప్రభుత్వం ఉండగా రైతులు పేదరికాన్ని అనుభవిస్తు వచ్చారు.

స్వాతంత్య్రానంతరం ఎర్పడిన ప్రభుత్వాలు కూడా పరిస్థితిని మెరుగు పరుచలేదు. చిలకమర్తి లక్ష్మీనరసిహంగారి మాటల్లో ఆంధ్ర వారను గడసరి గొల్లవారు పితుక్కున్నారు మూతులు బిగయగట్టి. గత ఏడు దశాబ్దాలుగా ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ రైతులు నీళ్లు, నిధులు కోల్పోయి కటిక దారిద్య్రంలోకి నెట్టివేయపడి ఆత్మవిశ్వాసం కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం రైతుల పాలిట సంజీవనియే గాక చాలా రకాలుగా విషిష్ఠమైనది. ఇప్పటిదాకా బ్యాంకుల్లో అప్పు తీసుకొని చెల్లంచనివారిని మాత్రమే ప్రభుత్వాలు ఆదుకున్నవి. పరోక్షంగా ప్రభుత్వాలు ఆర్థిక అరాచకాన్ని ప్రోత్సహించాయి. నిజాయితీగా అప్పులు చెల్లించినవారిని నిరుత్సాహానికి గురిచేశాయి. సార్వత్రిక పెట్టుబడి సహాయం ద్వారా ఆర్థిక క్రమశిక్షణకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. పరోక్షంగా ఇచ్చే రాయితీలు ప్రజలకు చేరాలంటే అనేక అంతరాలను దాటాలి. దళారీ వ్యవస్థలకు అవినీతికి ఆస్కారం లేకుండా ప్రజలకు నేరు గా నగదు బదిలీ విధానం వల్ల ఉద్యోగిస్వామ్యం, మధ్య దళారీల పాత్ర తగ్గిం ది. ఇతరులకు ఇవ్వడం తప్ప ఏమీ ఆశించని రైతాంగానికి తలుపుతట్టి డబ్బు పెట్టుబడి సాయంగా ఇవ్వడం ద్వారా ప్రభుత్వం రైతుల్లో గొప్ప మనోధైర్యా న్ని, కొత్త ఆశలను, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది.

రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న వివిధ సంక్షే మ పథకాలు గ్రామాల్లో ఆర్థిక కార్యకలాపాలను ఆశ్చర్యకరంగా పెంచాయి. సామాజిక పెట్టుబడి విధానాలైన రైతుబంధు, గొర్రెల పెంపకం, చేపల పెంప కం, చేనేత సహాయ పథకం, వివిధ వృత్తుల సహాయ పథకాల వలన డబ్బు ప్రజలకు చేరి సామాజిక పునర్నిర్మాణం జరుగుతున్నది. మౌలిక సదుపాయా లు కల్పించే రోడ్ల నిర్మాణం, రెండు గదుల ఇండ్లు, మిషన్ బగీరథ, మిషన్ కాకతీయ, ఎత్తిపోతల పథకాలు వేల కోట్ల రూపాయలను ప్రజలకు అంద జేస్తున్నాయి. ఉచిత కరెంటు, పునరుద్ధరింపబడిన చెరువులు, ఎత్తిపోతల పథ కం ద్వారా వేలాది ఎకరాలు కొత్తగా సాగులోకి వచ్చి గ్రామాలు కళకళాడుతున్నాయి.

రైతుబంధు పథకం మే నెలలో సంక్రాంతి సంబరాలను తెచ్చింది. శతాబ్దాలుగా దగా పడిన పల్లెలు ఇప్పుడు కొత్త పథకాలతో జీవం పోసుకుంటున్నాయి. గ్రామాలకు పట్టణాల నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. గ్రామాల్లో నిశ్శబ్ద ఆర్థిక విప్లవం అప్రతిహతంగా సాగుతున్నది. ప్రజల పరిస్థితి మెరుగుపడితే అనేక చిన్నతరహా పరిశ్రమలు స్థాపించబడుతాయి. నిరుద్యోగ భూతం రాష్ట్రం నుంచి తరిమివేయబడుతుంది. వివిధ పన్నుల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. తెలంగాణ ప్రజలు శతాబ్దాలుగా ఎదురు చూస్తున్న సహాయం కేసీఆర్ రూపంలో ఇప్పుడు వచ్చింది. మంచినీటి కొరత, సాగునీటి కొరత, ఆకలిచావులు లేని నవ తెలంగాణకు దృఢమైన పునాదులు పడుతున్నాయి.

కష్టాలు దాటుకుంటూ ప్రగతి దిశగా
ప్రస్తుత తెలంగాణ రాష్ర్టాన్ని చూస్తుంటే అన్నిరంగాల్లో అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న తీరు ప్రశంసనీయమే. నవ తెలంగాణ. రాజకీయ సుస్థిరత, ఆర్థికంగా బలమైన తెలంగాణ రూపుదిద్దుకుంటున్నది. ఇంతకాలం దిక్కుతోచక అల్లాడు తున్న అన్నదాత కళ్ళల్లో నేడు వెలుగులు. వ్యవసాయం పండుగలా వెలిగిపోతున్న హరిత తెలంగాణ. సమైక్య పాలనలో నిర్లక్ష్యానికి గురై ధ్వంసమైన చెరువులు నేడు ఎండకాలంలో కూడా నీటితో కళకళలాడుతూ గలగలా నీళ్లు పారుతున్న పంట కాల్వలతో జల తెలంగాణ అలరారుతున్నది.

దీనికంతటికీ కారణం కేసీఆర్. నాడు ఉద్యమాలతో తెలంగాణ ప్రజల హృదయాలను గెలుచుకొని, అలుపెరుగని పోరాటంతో జాతీయస్థాయిలో అందరి మద్దతును కూడగట్టి, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, ఎన్నికల్లో ప్రజా భిమానంతో ముఖ్యమంత్రి అయిన ఘనత కేసీఆర్‌దే. ఉద్యమకాలంలో తాను స్వయంగా చూసిన తెలంగాణ సమాజం వెతలు తీర్చటానికి కేసీఆర్ అనుక్షణం కృషి చేస్తున్నారు. ఆయనను నిరంతరం వెన్నంటి నడిపిస్తున్నది ఎన్నికల సమయంలో తన మార్గదర్శకత్వంలో పార్టీ విడుదలచేసిన ఎన్నికల ప్రణాళిక. కేసీఆర్ ప్రతి అడుగుకు దిక్సూచి, మార్గదర్శి ఆ ఎన్నికల ప్రణాళికే అనటంలో సందేహం లేదు.

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు నాలుగేండ్లు పూర్తయి, ఎన్నికల ఏడాది రాగానే గబాగబా ఎన్నికల ప్రణాళిక దుమ్ముదులిపి, అమలు చేయని హామీల విషయంలో అభూత కల్పనలు జోడించి ప్రజలను ఎలా మభ్యపె ట్టాలోనని కిందమీద పడుతుంటాయి. కానీ తెలంగాణలో జననేత కేసీఆర్ పరిస్థితి అందుకు విభిన్నం. ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువ చేశారు. హామీ ఇవ్వనివెన్నో చేశారు. ప్రజల మనసులు గెలుచుకు న్నారు. విమర్శకుల నోళ్లకు పనిలేకుండా చేశారు. చివరికి ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రులు, అధికారులు, కేంద్రమంత్రులు రాష్ట్రంలో పర్యటించి కేసీ ఆర్ పథకాలను కీర్తిస్తున్నారు. తమ రాష్ర్టాల్లో ఈ పథకాల అమలుకు చర్యలు తీసుకొంటున్నారు. తమ ఎన్నికల ప్రణాళికల్లో తెలంగాణలో అమలవుతు న్న పథకాలను పేరుమార్చి అమలు చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు. అది కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ఘనత.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి పరిస్థితులను అవలోకనం చేసుకుంటే.. ఒక టా, రెండా ఎన్నో విప్లవాత్మకమైన పథకాలు, కార్యక్రమాలు. అన్నీ చరిత్ర సృష్టించేవే. నాలుగేండ్ల స్వల్ప కాలవ్యవధిలో కేంద్ర ప్రభుత్వ సహకారం లేనప్పటికీ, ప్రతిపక్షాలు వివాదాలు సృష్టిస్తున్నప్పటికీ వినూత్న పథకాలు అమలు చేయటం మామూలు విషయం కాదు. అది కేసీఆర్ వల్లనే సాధ్య మైంది. వంద శాతం ప్రణాళికలు అమలుచేసిన ఘనత కేసీఆర్‌దే. ప్రణాళిక లో మాట మాత్రంగానైనా ప్రస్తావించని ఎన్నింటినో ఆచరణలోకి తీసు కొచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కింది. చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీ య శరవేగంగా సాగుతున్నది. కొత్తగూడెం నియోజకవర్గంలో రాష్ట్రంలోనే ఈ పథకం ద్వారా అత్యధికంగా సుమారు 25 కోట్ల రూపాయలతో సింగ భూపాలెం చెరువు మరమ్మతులు జరుతున్నాయి. ప్రాజెక్ట్ రీ డిజైనింగ్ వల్ల రాష్ట్రంలో పారే ప్రతి నది నీటి బొట్టును ఒడిసి పట్టడంతో తెలంగాణ భూమి ఆకుపచ్చని మాగాణంగా మారనున్నది. రెండు నెలల కిందట కాళేశ్వరం ప్రాజెక్టులోని కొన్ని బరాజులను చూసివచ్చాను. తెలంగాణ నీటి పారుదల రంగంలో సాంకేతిక మహా విప్లవం వచ్చిందనిపించింది.

వ్యవసాయరంగానికి కేసీఆర్ చలువ వల్ల మహర్దశ వచ్చింది. అధికారం లోకి రాగానే రుణాలు మాఫీచేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయానికి తోడు గా ఉద్యాన, పశు విశ్వవిద్యాలయాలను ఏర్పాటుచేశారు. కొత్తగూడెంలో తొలి కృషి విజ్ఞాన కేంద్రం పనులు ప్రారంభమయ్యాయి. గతంలో ఎన్నడూ చేయని విధంగా వ్యవసాయశాఖలో వేలకొద్ది క్షేత్రస్థాయి ఉద్యోగాలను భర్తీ చేశారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్తును అందిస్తూ రైతుల కళ్లల్లో వెలుగులు నింపిన మహానుభావుడు కేసీఆర్. చరిత్రలో తొలిసారి భూముల సమగ్రసర్వే పూర్తిచేసి కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. రైతు లకు, ప్రభుత్వానికి వారధిగా ఉండేందుకు రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేశారు. ముఖ్యంగా ఎకరానికి ఏడాదికి 8 వేల రూపాయలు పెట్టు బడి సాయంగా అందివ్వటం చరిత్రాత్మకం.

మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ఆవాసా లకు తాగునీటిని అందించే బృహత్తర కార్యక్రమాన్ని కేసీఆర్ చేపట్టారు. ప్రతి గ్రామానికి మంచినీళ్లు ఇవ్వకపోతే ఎన్నికల్లో ఓట్లు అడుగబోమంటూ ప్రతిజ్ఞ చేసిన ధైర్యవంతుడు కేసీఆర్. ఏండ్ల నుంచి ప్రజలు కోరుకొంటున్న విధంగా కేసీఆర్ కొత్త జిల్లాలను, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, నగర పాలికలు, పంచాయతీలను ఏర్పాటుచేశారు. తండాలను కూడా పంచాయతీలుగా మార్పుచేసి గిరిజన స్వయంపాలనకు పునాదులు వేసిన మహెూన్నత జనరంజక పాలకుడు కేసీఆర్. మరోవైపు తెలంగాణలో విద్యా విప్లవం వస్తున్నది. బల హీన, వెనుకబడినవర్గాల కోసం వందల గురుకులాలు ప్రారంభి స్తున్నారు. నియోజకవర్గం కేం ద్రంగా అన్నివర్గాలకు గురుకులాలు ఏర్పాటుచేసి అందరికి విద్య అందిస్తున్నారు.
మహిళలకు బాసటగా కేసీఆర్ నిలుస్తున్నారు. ఆసరా, వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళా పింఛన్లు అందిస్తున్నారు.

పెళ్లి సమ యంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా అండగా నిలబడు తున్నారు. కేసీఆర్ కిట్ ద్వారా మాతా శిశు రక్షణకు తోడ్పాటు అందిస్తున్నా రు. నేను కూడా కేసీఆర్ పిలుపు అందుకొని 2014 సాధారణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ తరపున నాటి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కొత్త గూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగాను. చాలామంది నన్ను హేళన చేశారు. ఆంధ్రా ప్రాంత ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ జిల్లాలో ఎలా గెలు స్తాడని ఎగతాళి చేశారు. 1969 నుంచి ఉద్యమస్ఫూర్తి ఉన్న కొత్తగూడెం ప్రజలు నన్ను అక్కున చేర్చుకున్నారు. ఎన్నికల ప్రణాళికలో హామీ ఇవ్వన ప్పటికీ కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుచేస్తానని నిండు శాసనసభ లో ప్రకటించారు.

కరువు తొలగి సిరులు కురిసి
రైతన్న సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టింది. ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో, సరికొత్త పథకాలతో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పాలన కొనసాగుతున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మొదటిరోజు నుంచి రైతు సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాలన కొనసాగిస్తున్నది.సమైక్య పాలనలో ఎక్కువగా నష్టపోయింది ఉమ్మడి పాలమూరు జిల్లా. రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి పోనంత వలసలు పాలమూరు జిల్లా నుంచి వలస వెళ్ళేవారు. ఏటా 14 లక్షలు మంది వలసపోయే జిల్లాగా పాలమూరు ప్రఖ్యాతిగాంచింది. అనావృష్టితో పాలమూరు జిల్లాలో రైతు ల పరిస్థితి అధ్వానం. పంట పొలాలున్నా పండించలేని దుస్థితి. ఏ ప్రభు త్వం కూడా వ్యవసాయరంగాన్ని పట్టించుకోకుండా పాలన సాగించిందే తప్పా రైతు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం వచ్చిన తర్వాతనే రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుదన్న మానవీయ ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షే మ పథకాల వల్ల పాలమూరు జిల్లాలో వలసపోయిన కూలీలు వలస జిల్లాకు తిరిగి వస్తున్నారు.
తెలంగాణలో 112.08 లక్షల హెక్టార్ల విస్తీర్ణం ఉండగా అందులో 60 శాతం సాగుకు అనుకూలమైన భూమి ఉన్నది. రైతులు పంటలు పండించాలంటే సాగునీరు ప్రధానం. దీనికోసం ప్రభుత్వం భారీ నీటి పారుదల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టులు శరవేగంగా పూర్తవుతున్న యి. ఇప్పటికే చాలా ప్రాజెక్టులు పూర్తయి రైతులకు సాగునీరును అందిస్తున్నది. ఏనాడు నిండని కాలువలు నేడు స్వరాష్ట్రంలో నిండుకుండలా పారుతున్నవి. రైతులకు సబ్సిడీ విత్తనాల నుంచి ఎరువుల వరకు వ్యవసాయానికి అవసరమయ్యే ప్రతీది కష్టం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. కోటి ఎకరాల సాగు స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా ప్రాజెక్టు లు పరుగులు తీస్తున్నవి.
వ్యవసాయాన్ని పండుగలా చెయ్యడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది. రాష్ట్రంలోని రైతులను సూక్ష్మ నీటిపారుదల సేద్యం వైపు మళ్ళించేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది. రైతులకు 80 శాతం నుంచి 100 శాతం వరకు సబ్సిడీ అందిస్తున్నది. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం బీసీ, చిన్న, సన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది. దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని లాభాల బాటలో కొనసాగుతున్నరు.

ఇక నుంచి రైతన్న పంటకు పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లవలసిన అవసరంలేదు. వ్యవసాయరంగంలో పెట్టుబడే ప్రధాన సమ స్య. ఈ పెట్టుబడి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం రైతుబంధు పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 58 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. దశాబ్దాలుగా అప్పుల్లో కూరుకుపోయి న రైతన్నకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రైతు బంధు పథకాన్ని ప్రారంభించింది. అన్నదాతలు తల ఎత్తుకొని జీవించే లా రూపొందిన రైతులకు పథకం వ్యవసాయరంగానికి పెద్దపీట వేసింది. యాభై ఏండ్లలో కాంగ్రెస్ లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తే, తెలంగాణ రాష్ట్రం వచ్చినంక ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిది.

Send a Comment

Your email address will not be published.