నేర్చుకోండి, నేర్పండి

నేర్చుకోండి, నేర్పండి

భాషించే భాషలో భావం మనసు మెదిలి వస్తుంటే అనుబంధం అర్థాన్ని ఆత్మతో స్పృశిస్తుంటే ఉల్లాసంతో ఉత్సాహం ఉవ్వెత్తున రేకెత్తిస్తే గాయపడి, బాధలో అమ్మా! అబ్బా! దేవుడా..! అని దైవం, తలిదండ్రుల గురుతుకుతెచ్చి ఆ మమకారాన నిను తడిపి ఆ బాధ, వ్యధలను మరిపిస్తే ఆ పలుకే ! మరి తల్లి భాష ఉగ్గుపాలతో నువు నేర్చిన భాష నావరకైతే అది, నేనమితంగా ప్రేమించే నా తెలుగు భాష మరి మీకో ..? ప్రేమించండి, ఆదరించండి నేర్చుకోండి, నేర్పండి తరతరాలకు తెలపండి మాతృభాషను మరువద్దని ప్రతి ఎదలో పదిలపరచమని

Send a Comment

Your email address will not be published.