పదిహేను వసంతాల తెలుగుదనం

పదిహేను వసంతాల తెలుగుదనం

మెల్బోర్న్ తెలుగు లేడీస్ క్లబ్

TLC_2017_1ఒకటిన్నర దశాబ్దాల యుక్త వయసు. తోటి వారికీ సేవ చేయాలన్న మనసు. తెలుగుదనం ఉట్టిపడే వర్చస్సు. ఆపదలో ఉన్న వారికి ఇదొక వయాసిస్సు.

మెల్బోర్న్ తెలుగు లేడీస్ క్లబ్ 15 సంవత్సరాలు నిండిన సందర్భంగా పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలతో కూడిన వార్షికోత్సవం కాలింగ్ వుడ్ టౌన్ హాల్ లో జరుపుకున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి యారా సిటీ మేయర్ Ms.ఆమండ స్టోన్ విచ్చేసారు. కీలకోపన్యాసం శ్రీమతి మంజుల ఓ కానర్ ‘Life of Migrant women in Australia’ అంశంపై ప్రసంగించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఇక్కడి తెలుగు సంఘంలో ప్రముఖులు మరియు కృష్ణ రవళి సంగీత కళాశాల వ్యస్థాపక సంచాలకులు శ్రీమతి రమారావు గారికి సంగీత కళలో వారి ప్రావీణ్యాన్ని గుర్తించి సన్మానం చేయడం జరిగింది. అలాగే శ్రీమతి జయ మంచికంటి గారికి TLC కి వారు చేసిన సేవలకు గాను సన్మానించడం జరిగింది. శ్రీమతి పూర్ణ జొన్నలగడ్డ గారికి TLC లోగో డిజైన్ చేసినందుకు సన్మానం అందుకున్నారు.

ఈ కార్యక్రమానికి బిర్యానీ మహల్ వారు మంచి విందు భోజనం అందించారు. స్వీట్ ఇండియా వారు కూడా రుచికరమైన మిఠాయి అందించారు.

TLC_2017_2తెలుగు లేడీస్ క్లబ్ తరఫున బిర్యానీ మహల్, స్వీట్ ఇండియా మరియు ఆ రోజు కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులు, TLC సభ్యులు, కార్యక్రమ వాచస్పతులు మరియు స్వచ్చంద సేవకులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఆర్ధిక సహాయం అందించిన మాగంటి లాయర్స్, ఇంటిగ్రేటెడ్ అకౌంటెంట్స్, ఆస్ట్రేలియన్ లేసెర్ & స్కిన్ క్లినిక్, సిడ్నీ మెడికల్ క్లినిక్ వారికీ కూడా కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగు సంఘాల ప్రతినిధులు శ్రీని కట్ట, ప్రవీణ్ తోపుచర్ల, వెంకట నూకల, మహేష్ వేమూరి కూడా హాజరయ్యారు.

Send a Comment

Your email address will not be published.