పార్లమెంటులో బతుకమ్మ

MTF_Parliament_2
20180823_183929-1
IMG-20180828-WA0012(1)

ఈ సంవత్సరం బతుకమ్మ పండగ సంబరాలు మెల్బోర్న్ నగరానికి తొందరగా వచ్చాయి.  ఈ సంబరాలు వస్తూనే విక్టోరియా రాష్ట్ర పార్లమెంటులో మొదలవడం అందునా విశేషం.

బతుకమ్మ అంటేనే ఒక సుందర స్వప్నం. అందమైన పూల పండగ.  పిల్లలు, పెద్దవాళ్ళు తర తమ బేధం లేకుండా ఆరాధ్య దైవమైన అమ్మవారిని పూజించి భక్తి శ్రద్ధలతో జరుపుకునే ముచ్చటైన పండగ.

ప్రతీ ఏటా మెల్బోర్న్ తెలంగాణా ఫోరం అధ్వర్యంలో ఎంతో వైభవోపేతంగా జరిగే ఈ పండగ ఈ నెల 23వ తేదీన విక్టోరియా పార్లమెంటులో మొదటిసారిగా పలువురు స్థానిక మంత్రులు పార్లమెంటు సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది.  పార్లమెంటు హాలులో బతుకమ్మను రకరకాల పూలతో అలంకరించి బతుకమ్మ పాటలను నృత్య సహితంగా చాలా మంది తెలంగాణా వనితలు ఆలపించారు.

ముందుగా రాగామృత సంచాలకులు శ్రీమతి మాధురి వాస శ్రీ గణేశ స్తోత్రంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.  తరువాత పూలతో అలంకరించిన అమ్మవారి చుట్టూ చాలామంది వనితలు బతుకమ్మ నృత్యగానలను ఆలపించి ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసారు.  ఈ నృత్యంలో మేరీ బైర్నాంగ్ డిప్యుటీ మేయర్ మిస్ సరా కార్టర్ పాల్గొని ఎంతో చక్కని నృత్యం చేసారు.  భారతీయ సాంప్రదాయాలలో అత్యంత విలువైన ఈ ప్రత్యేక  పండగని మేరీ బైర్నాంగ్ లో ప్రతీ ఏడాది జరిపి మెల్బోర్న్ నగరానికి వన్నె తెస్తున్న మెల్బోర్న్ తెలంగాణా ఫోరం ని అభినందించారు.

అభినయ నృత్య కళాశాల సంచాలకులు మరియు విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొని సంగీత నృత్యరూపకం అభినయించారు.

శ్రీ మురళీ ధర్మపురి గారు మెల్బోర్న్ తెలంగాణా ఫోరంపై వ్రాసిన థీమ్ సాంగ్ ఈ కార్యక్రమంలో ఆవిష్కరించడం జరిగింది.

ఈ క్రింద నుదహరించిన పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చి తమ అమూల్య సందేశం అందించారు.

Honourable Robin Scott – Minister for Multicultural affairs
Honourable Marlene Kairouz – Minister for Consumer Affairs
Cesar Melhem – Member of the Legislative Council for the Western Metropolitan Region
Khalil Eideh – Member of the Legislative Council for the Western Metropolitan Region
Mary-Anne Thomas – MP Macedon
Natalie Suleyman – MP St Albans
Bronwyn Halfpenny – MP Thomastown
Geoff Howard – MP Buninyong
Danielle Green – MP Yan Yean
Katie Hall – MP Footscray
Sarah Carter  – Dy Mayor Maribirnong City Council
IMG-20180828-WA0014
IMG-20180828-WA0013
IMG-20180828-WA0008

Send a Comment

Your email address will not be published.