బాలకృష్ణ 107

బి.గోపాల్‌ దర్శకత్వంలో బాలకృష్ణ 107వ సినిమా

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం తరువాత తన 107వ సినిమాని బి.గోపాల్‌ దర్శకత్వంలో చేయనున్నాడని సినీ వర్గాలు నుంచి వినిపిస్తున్న సమాచారం. ఇప్పటికే సినిమాకి సంబంధించి స్ర్కిప్టుని కూడా రాసుకున్నారట. ఇందుకోసం రచయిత బుర్రా సాయిమాధవ్‌ స్ర్కిప్టుకి మరింత బలం చేకూర్చే విధంగా తయారు చేస్తున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. ఇందులో బాలయ్య ఓ యవతికి తండ్రి పాత్రలో కనిపించబోతున్నారట. మొత్తం మీద కరోనా వైరస్‌ ప్రభావంతో విధించిన లాక్‌డౌన్‌ పూర్తికాగానే బోయపాటి చిత్రం షూటింగ్‌ జరుపుకోనుంది. ఈ చిత్రం పూరైయిన వెంటనే బి.గోపాల్‌ సినిమా మొదలుపెట్టనున్నారని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. బాలకృష్ణ గత ఏడాది ‘రూలర్‌ చిత్రంలో నటించాడు. ఇందులో ప్రకాష్‌ రాజ్‌, వేదిక, భూమిక, జయప్రద తదితరులు నటించారు

Send a Comment

Your email address will not be published.