భగవంతుడికి ఇవ్వాలంటే...

భగవంతుడికి ఇవ్వాలంటే...

అది 1882 వ సంవత్సరం. శ్రీరామకృష్ణ పరమహంస బ్రహ్మసమాజ వార్షికోత్సవంలో పాల్గొని ప్రసంగించారు. భక్తుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి.

“సారంలో ఉన్న వ్యక్తికి తన మనస్సుని భగవంతునికి ఇవ్వడం ఎందుకు సాధ్యం కాదో తెలుసా? అతని మనస్సు అతని వద్ద లేకపోవడమే. మనస్సు అనేది అతని వద్ద ఉండి ఉంటే దానిని భగవంతుడికి ఇచ్చేసే వాడే. కానీ మనస్సుని తాకట్టు పెట్టాడు. దేనిమీదో తెలుసా…కామినీ కాంచనాలపై. కనుక సర్వదా సాధుసాంగత్యంలో ఉండటం సంసారికి ఎంతైనా అవసరం. మనస్సు మళ్ళీ తనకు దక్కినప్పుడే అతను సాధన, భజనలు చేయడానికి వినియోగించుకోగలుగుతాడు. కానీ నిరంతరం గురువుతో సాంగత్యం, గురువును సేవించడం , సాదు సాంగత్యం వంటివి చాలా అవసరం. ఏకాంతంలోనూ భగవంతుడి చింతనే చేయాలి. లేదా సాధుసాంగత్యమైనా చేయాలి. అలాకాకుండా మనస్సుని దాని మానాన దాన్ని విడిచిపెడితే అది ఎండిపోతుంది. ఒక పాత్రలో నీరు తీసుకుని దాన్ని ఓ పక్కనే పెట్టామనుకోండి కొంతకాలానికి అది ఎండిపోతుంది. అలాకాకుండా ఆ పాత్రను గంగలో ముంచినట్టైతే అలా కాదు….కనుక భగవత్ చింతన కోసం సజ్జన సాదు సాంగత్యం ఎంతో అవసరం” అన్నారు శ్రీ రామకృష్ణ పరమహంస.
———————
మహిమ, గుంటూరు

Send a Comment

Your email address will not be published.