భారతీయుడు - 2లో అజయ్

Bharateeyuduవిశ్వనటుడు కమల్‌హాసన్ కాంబినేషన్ మూవీ ‘భారతీయుడు’ ఎంత పెద్ద సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అప్పట్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సహా విదేశాల్లోనూ ఈ సినిమా అఖండ విజయం సాధించడమే గాక, ఇండియా తరపున ఆస్కార్ బరిలోకి వెళ్లింది ఆ చిత్రం. ఇప్పటికే ఈ సినిమా రిలీజై రెండు దశాబ్ధాలు అయ్యింది. ఆ క్రమంలోనే భారతీయుడుకి సీక్వెల్ తెరకెక్కిస్తున్నామని శంకర్ తైవాన్‌లో ప్రకటించారు. ఇటీవలి కాలంలో 2.0 చిత్రీకరణలో బిజీగా ఉండడం వల్ల భారతీయుడు 2కి సంబంధించిన ఏ అప్‌డేట్ చెప్పలేదు.

ప్రస్తుతం 2.౦ నిర్మాణానంతర పనులు సాగుతున్నాయి కాబట్టి ఇక భారతీయుడు 2 రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ప్రముఖ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్ ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనతో శంకర్ మంతనాలు సాగిస్తున్నారు. శంకర్‌కి యాక్షన్ హీరో అజయ్ దేవగణ్ తో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా అతడినే ఎంపిక చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

భారతీయుడు 2 ప్రీప్రొడక్షన్ స్వింగులో ఉంది. తదుపరి రామోజీ సిటీలో భారతీయుడు 2 భారీ షెడ్యూల్ తెరకెక్కించనున్నారు. ఇక సినిమా ఆరంభం నుంచే శంకర్ తనదైన శైలిలో ప్రచారం సాగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2019 జనవరిలో రజనీ 2.0 చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాల్లో ఉన్న సంగతి తెలిసిందే.

Send a Comment

Your email address will not be published.