మహా పర్వదినం మహా శివరాత్రి

mahashiavaratri

ఈ నెల 4 మహా శివరాత్రి

మన ముఖ్యమైన పండుగల్లో మహా శివరాత్రి ఒకటి. ఏటా మాఘ బహుళ చతుర్దశిని శివరాత్రిగా జరుపుకుంటాం. ప్రతి నెలా కృష్ణ చతుర్దశి మాస శివరాత్రి. ఆవేళ కూడా ప్రార్థనలు చేసినప్పటికీ మహా శివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా, పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ నెల 4న ఈ పర్వదినాన్ని హిందువులు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నారు

శివరాత్రి రోజున ఉపవాసం ఉండి, జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పూలూ ఫలాలతో శివునికి పూజ చేస్తారు. ఈరోజున ప్రతి దేవాలయమూ కిక్కిరిసి ఉంటుంది. ఇక శివాలయాల సంగతి చెప్పనవసరమే లేదు. ఇసుక వేస్తే రాలనట్టు భక్తుల రద్దీ కనిపిస్తుంది. అభిషేకాలు, పూజలతో పరమశివుని ఆరాధిస్తారు.

భక్తుల పాలిట కల్పతరువు అయిన శివునికి ఈ విశిష్ట దినాన రోజంతా ప్రత్యేక పూజలు జరుపుతారు. రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి. పూజలు, భజనలతో శివనామం మారుమోగుతుంటుంది. ఈ పర్వదినాన లింగాష్టకం , శివ పంచాక్షరి జపిస్తారు. దీపారాధన చేసి, భక్తిప్రపత్తులతో రుద్రాభిషేకం చేస్తారు. శివపార్వతుల కల్యాణం చేస్తారు. రోజంతా పరమేశ్వరుని ప్రార్థనలతో, చింతనలో గడిపి, రాత్రి జాగారం చేస్తారు. శివరాత్రి పర్వదినానికి ఉపవాసం, జాగారం ముఖ్యం.

మహా శివరాత్రి పర్వ ఆచరణలు

shivjiవిద్యాసుశృతిరుత్కృష్టా ,తత్ర రుద్రైకాదశినీస్మృతా |
తత్ర పంచాక్షరీం , తస్య శివఇత్యక్షరద్వయం ||

విద్యలన్నింటిలో వేదముగొప్పదిగా చెపుతారు,అందులోనూ సంహితాకాండలోని రుద్రము(వీటినే నమక చమకాలనికూడా అంటారు) అందులో ఓం నమశ్శివాయ అనేపంచాక్షరి అనేమంత్రం గొప్పది అందులోనూ శివ అనే రెండక్షరాలు చాలాగొప్పవి.అని శాస్త్రవచనం.

శివనామమును నారాయణుడు యోగనిద్రలో జపిస్తాడని ప్రతీతి.దేవోత్తముడైన శివునిస్మరణ చేసినవానికి జీవితంలో భోగభాగ్యములను పొందుతారు, మరణానంతరం శివులోకములో సాలోక్యము (శివలోకముగా ఉండుట) పొందుతారు,లేదా సామీప్య (శివునికిదగ్గరగా ఉండుట) జరుగుతుంది, లేదా సారూప్య (శివరూపాన్నీపొందటం )జరుగుతుంది లేదా మోక్షము (అంటే వీటికన్నా అతీత స్థితిపొందుట) జరుగుతుంది అని శివపురాణము ఉదాహరిస్తుంది.

మూడుమూర్తులకును మూడులోకములకు
మూడుకాలములకు మూలమగుచు
భేదమగుచు తుదికభేదమైయొప్పారు
బ్రహ్మమనగ నీవె ఫాలనయన — పోతన భాగవతం

సృష్టి స్థితి లయకారకులగు మూడు దేవతామూర్తులకు,పైలోకాలు,భూలోకము,క్రిందిలోకాలనే మూడు లోకాలకు, భూతభవిష్యత్‌ వర్తమానకాలాలనేమూడుకాలాలకి మూలముగా ఉండి అన్నిగా విడిపోయి చివరకు తనలోనింపుకునే ఒకే అణు స్వరూప శక్తి శంకరుడు.

శంకరోతి ఇతి శంకరః అనగా శమము లేదా శాంతినిచేయువాడు అని అర్థము. దుఃఖమునందున్నవారికి ఉపశమనం శివనామస్మరణ చేసనవారికి దినదినాభివృద్ధి కలుగుతుంది.

అభిశేకప్రియశ్శివః అలంకారప్రియో విష్ణుః,
అభిషేక ప్రియశ్శివః అని ఆగమాదులు చెపుతున్నాయి. అలంకారము విష్ణువుకి,అభిషేకము శివునికి ప్రీతి.

శివునుశిరమునకాసిన్ని నీళ్లుజల్లి
పత్తిరిసుమంతనెవ్వాడు పారవైచు
కామధేనువు వానింటి గాడిపశువు
అల్లసురశాఖ వానింటిమల్లెచెట్టు – చాటువు

శివునికి అభిషేకంచేసి పత్రితో పూజించినవాడికి కోరికలు తీర్చే కామధేనువు ఇంటి పశువౌతుంది. ఏదైనా ఇవ్వగలిగే కల్పవృక్షం పెరటి చెట్టౌతుంది (అంతగా వరములిస్తాడని తాత్పర్యం)

శివరాత్రి అంటే..

శివరూమం లింగరూపం అందులోనూ వృత్తాకారం శివుడు,పానవట్టం పార్వతీరూపం అని ఆగమవాక్యం. ఒకప్పుడు హరిబ్రహ్మాదులకు చైతన్యకారకంగురించి స్పర్థ వచ్చినప్పుడు వారిమధ్య ఒక పెద్ద జ్యోతి రూపం ఏర్పడింది. ఆ రూపం పైకొన చూడటానికి హంస రూపంలో బ్రహ్మ, వరాహంగా విష్ణువు వెళ్లారు ఎంతసేపటికీ అంతుతెలియక అలసిపోయి ప్రార్థన చేయగా ఆజ్యోతి శివలింగాకారంగా శివప్రతీకగా ఏర్పడినది.

జ్ఞానరూపియైన శివుడు చైతన్యజ్యోతిగా ఆవిర్భవించిన రాత్రి అమావాస్య గా చెపుతారు దానిముందురోజు శివరాత్రిగా చెపుతారు.కాబట్టే లోకంలో ఇప్పటికీ త్రయోదశి చతుర్దశి కలిసిన రోజుని శివరాత్రిగా చెపుతారు ఇదిప్రతిమాసంలో వస్తుంది. కానీ పాలసముద్రం చిలికినపుడు హాలాహలభక్షణం చేసి ఒక చిన్న రేగుపండు అంతగా చేసి కంఠంలో ధరించినరాత్రి లోకాల్నికాపాడిన శివుని ఆరాత్రి జాగరణతో దేవతలు జనులు ప్రార్థించినరాత్రిగా మహాశివరాత్రి అని చెపుతారు. లోకమంతా శివరక్షణవల్ల మంగళాన్ని పొందుటవల్ల దానికి ప్రతీకగా శివ కళ్యాణాన్ని కూడ జరుపుతారు.

శివరాత్రి నాడు చేయవలసిన విధులు

Mahashivaratri1ప్రాతఃకాలంలో లేవడం
ఉతికిన వస్త్రాలు ధరించాలి
దేవాలుదర్శనం చేయాలి
అన్నం కాకుండా పాలు, పండ్లు పలహారంమాత్రమే తీసుకోవాలి
తక్కువ ఆహారం తీసుకోవాలి
ఇతరులతో మటల్లోకూడా దైవసంబంధమైనవే ఎక్కువగా ఉండటం
వీలైనంత తక్కువ వమాట్లడటం
ఎక్కువసేపు పంచాక్షరీ (ఓం నమశ్శివాయ) జపం చేయటం
పండ్లు పలహారాలు దేవునుకి నివేదించటం వాటిని ఇతరులకు పంచిపెట్టటం
వీలైనంత వరకు జాగరణచేయటం
శివునికి అభిషేకం చేస్తే చాలామంచిది
చాపమీద పడుకోవటం ,
స్త్రీ లైనా పురుషులైనా బ్రహ్మచర్యం పాటించటం
లింగోద్భవపుణ్యకాలం వరకూ మేల్కొని ండాలి వీలైతే మరుసటి రోజువరకూ ఉండాలి.

 

శివరాత్రి నాడు చేయకూడనివి

అనారోగ్యంతో ఉపవాసం చేయకండి సాత్విక ఆహారం స్వీకరించి పూజించండి.
ప్రాతస్సంధ్య,సాయం సంధ్యలో నిద్రపోకండి,
శివ పూజకి మొగలిపూవు వాడకండి .
నీటిని అభిశేకానికి ఎక్కువగా వాడండి ఇతరపదార్థాలు (పంచామృతం,పండ్లరసాలు,సుగంధ పరిమళ పదార్థాలు) తక్కువగావాడండి.
సిమెంట్‌ రాతివంటి అన్నిలింగాలకన్నా పుట్టమన్నుతో చేసినశివలింగానికి అభిశేకిస్తే ఎక్కువ ఫలితం వస్తుంది.
తినాల్సిన స్థితివస్తే పిండిపదార్థాలు తీసుకోవచ్చు.

శివరాత్రి మహత్యం
భక్తులు ఈరోజున పరమేశ్వరుని ఆరాధించడమే కాకుండా ఏ తప్పులూ చేయకూడదని, అబద్ధాలు చెప్పకూడదని విశ్వసిస్తారు. ఏడాది పొడుగునా ఏ పూజలూ చేయనివారు కూడా మహా శివరాత్రి నాడు ఈశ్వరుని ప్రార్ధించి శివ సన్నిధి పొందినట్లు పురాణాలలో ఎన్నో కధలు ఉన్నాయి. ఆఖరికి పాపాత్ములు కూడా శివరాత్రి రోజున అనుకోకుండా నియమాలు పాటించినా సరే ముక్తి లభిస్తుంది అంటారు. గుణనిధి కధ ఇందుకు సాక్ష్యం. శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తేలిక. అందుకే “భక్తవశంకర” అన్నారు.

బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గుణనిధికి ఏ ఆచారాలూ పట్టవు. దుర్గుణాలన్నీ అలవరచు కుంటాడు. అన్ని విధాలుగా పతనమైన అతను మహా శివరాత్రి నాడు కావాలని కాకున్నా, అన్నం దొరక్క ఉపవాసం ఉంటాడు. ప్రసాదం దొరుకుతుందనే ఆశతో దేవాలయానికి వెళ్తాడు. చీకటిలో కనిపించక అవసరం కోసం దీపం వెలిగిస్తాడు. జాగారంలో తూగుతున్న భక్తుల అలికిడికి భయపడి పారిపోబోయి అనుకోకుండా శివ సన్నిధిలో ప్రాణాలు విడుస్తాడు. ఆవిధంగా ముక్తి పొందుతాడు. అదీ సంగతి. శివరాత్రి మహత్యం అంతటిది.

Send a Comment

Your email address will not be published.