మూడు రోజుల్లో లక్ష పెళ్లిళ్లు

marraigeహైదరాబాద్ నగరంలో వచ్చే మూడు రోజుల్లో లక్ష పెళ్లిళ్లు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

రానున్న శుక్ర మూఢమి కారణంగా ఈ నెల మూడు రోజులు మాత్రమే ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్ల జోరు ఎక్కువైందని తెలుస్తోంది.

జంట నగరాల్లోని ఫంక్షన్ హాల్స్, కళ్యాణ మంటపాలు, హోటల్స్, రిసార్ట్స్, పార్కులు, ఖాళీ స్ధలాలు, మైదానాలు అన్నీ బుక్ అయిపోయాయని అధికారులు తెలిపారు. ఈ పెళ్లిళ్ల ఖర్చు వెయ్యి కోట్ల రూపాయల పైమాటేనని కూడా పురపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. జంట నగరాల్లో ఈ స్థాయిలో పెళ్లిళ్లు జరగడం చాలా అరుదు.

ఇక పెళ్లి సామగ్రి, పురోహితులు, క్యాబ్స్, పూల దండలు…వగైరాల వ్యాపారం కూడా విపరీతంగా పెరిగిపోయింది. ఈ నెల 26 నుంచి శుక్ర మూఢమి కారణంగా ముహూర్తాలు లేకపోవడం, మళ్ళి ఫిబ్రవరి వరకు శుభకార్యాలకు అవకాశాలు లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. చివరికి దేవాలయాలు కూడా పెళ్లి జంటలతో కిటకిట లాడిపోయే అవకాశం ఉంది.

Send a Comment

Your email address will not be published.