రాయప్రోలు వారి కొన్ని పద్య మాలికలు

రాయప్రోలు వారి కొన్ని పద్య మాలికలు

శా॥ ఆచాళుక్యనృపాలరత్నముల వియ్యమ్మంది శ్రీకాకతి
క్ష్మాచక్రేశుల లాలనల్ వడసి కృష్ణప్రాజ్యసామ్రాజ్య పీ
ఠీచంచజ్జయకన్యతో సరసగోష్ఠిన్ ప్రొద్దువోబుచ్చు నీ
ప్రాచీనాభ్యుదయంబు నెన్నెదము గర్వస్ఫూర్తి; ఆంధ్రావనీ! (రాయప్రోలు)

సీ॥ తనగీతి అరవజాతిని పాటకులనుగా దిద్ది వర్ధిల్లిన తెనుగువాణి,
తనపోటులు విరోధితండంబులకు సహింపనివిగా మెరసిన తెనుగుకత్తి,
తనయందములు ప్రాంతజనుల కభిరుచి వా సన నేర్పనలరిన తెనుగురేఖ,
తనవేణికలు వసుంధరను సస్యశ్యామ లను చేయగలిగిన తెనుగుభూమి,
అస్మదార్ ద్రమనోవీధి నావహింప, జ్ఞప్తివచ్చె నేడిదిచూడ;చావలేదు,
చావలేదాంధ్రులమహోజ్జ్వలచరిత్ర;హృదయములు చీల్చి చూడుడో సదయులార!
(రాయప్రోలు)
సీ॥ మగధసామ్రాజ్యసీమలు నీ సితచ్ఛత్ర ముక్తాఫలచ్ఛాయ మునుగునాడు,
అలకళింగోపాంత మందు నీ కంఖాణ ఖురధూళి నెరసందె గురియునాడు,
కర్ణాటరాజ్యరంగముల నీ కవులను బ్రహ్మరథంబులు పట్టునాడు,
తంజాపురోద్యానకుంజమ్ములందు నీ సంగీతమధుధార పొంగునాడు,
అతిభయంకరశౌర్యధైర్యప్రసక్తి రసవశంకరనాగరరాగశక్తి
ఏకమై,పాకమై,ప్రవహించినట్టి ఆ యఖండప్రభావ మేమాయెనమ్మ! (రాయప్రోలు)

Send a Comment

Your email address will not be published.

రాయప్రోలు వారి కొన్ని పద్య మాలికలు

రాయప్రోలు వారి కొన్ని పద్య మాలికలు

శా॥ ఆచాళుక్యనృపాలరత్నముల వియ్యమ్మంది శ్రీకాకతి క్ష్మాచక్రేశుల లాలనల్ వడసి కృష్ణప్రాజ్యసామ్రాజ్య పీ ఠీచంచజ్జయకన్యతో సరసగోష్ఠిన్ ప్రొద్దువోబుచ్చు నీ ప్రాచీనాభ్యుదయంబు నెన్నెదము గర్వస్ఫూర్తి; ఆంధ్రావనీ! (రాయప్రోలు) సీ॥ తనగీతి అరవజాతిని పాటకులనుగా దిద్ది వర్ధిల్లిన తెనుగువాణి, తనపోటులు విరోధితండంబులకు సహింపనివిగా మెరసిన తెనుగుకత్తి, తనయందములు ప్రాంతజనుల కభిరుచి వా సన నేర్పనలరిన తెనుగురేఖ, తనవేణికలు వసుంధరను సస్యశ్యామ లను చేయగలిగిన తెనుగుభూమి, అస్మదార్ ద్రమనోవీధి నావహింప, జ్ఞప్తివచ్చె నేడిదిచూడ;చావలేదు, చావలేదాంధ్రులమహోజ్జ్వలచరిత్ర;హృదయములు చీల్చి చూడుడో సదయులార! (రాయప్రోలు) సీ॥ మగధసామ్రాజ్యసీమలు నీ సితచ్ఛత్ర ముక్తాఫలచ్ఛాయ మునుగునాడు, అలకళింగోపాంత మందు నీ కంఖాణ ఖురధూళి నెరసందె గురియునాడు, కర్ణాటరాజ్యరంగముల నీ కవులను బ్రహ్మరథంబులు పట్టునాడు, తంజాపురోద్యానకుంజమ్ములందు నీ సంగీతమధుధార పొంగునాడు, అతిభయంకరశౌర్యధైర్యప్రసక్తి రసవశంకరనాగరరాగశక్తి ఏకమై,పాకమై,ప్రవహించినట్టి ఆ యఖండప్రభావ మేమాయెనమ్మ! (రాయప్రోలు)

Send a Comment

Your email address will not be published.