షికాగోలో చంద్రబాబు

chandrababuమూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా బుధవారం షికాగో వచ్చిన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎం. చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం లభించింది. ఆయన ఇక్కడికి రాగానే గ్లోబల్ తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. నవ్యఆంధ్రలో తమ సంస్థలను ఏర్పాటు చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ముందుకు వచ్చారు. ఆయన ఇక్కడ ఐ.టి సంస్థల ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 12 నెలల్లో 500 కంపెనీలు కార్యకలాపాలు ప్రారంభించాలన్నదే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కాగా, విజయవాడలో ఐ.టి సంస్థల ఏర్పాటుకు సుమారు అరవై కంపెనీల ప్రతినిధుల సంసిద్ధత వ్యక్తం చేశారు. షికాగోలో ఐ.టి కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఆయన ఈ సందర్బంగా తానా ప్రతినిధులతోనూ చర్చలు జరిపారు.

Send a Comment

Your email address will not be published.