సాధు అరుణాచలం - మేజర్ చాడ్విక్

సాధు అరుణాచలం - మేజర్ చాడ్విక్

మేజర్ చాడ్విక్ ఓ యూరోపియన్. ఆయన 1890 లో పుట్టారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఆయన ఓ మేజర్ గా పని చేశారు. యుద్ధరంగంలో రక్తపాతం చూసి ఆయన మనసు చలించింది. విరక్తి పుట్టింది. ఏ సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా అనే శీర్షికన పాల్ బ్రన్టన్ రాసిన పుస్తకం చదివారు. ఆ పుస్తకం ఆయనను ఎంతగానో ప్రభావితం చేసింది. ఆర్మీ నుంచి బయటకు వచ్చేశారు. తత్వాన్వేషణలో పడ్డారు. భగవాన్ రమణ మహర్షి గురించి ఆనోటా ఈనోటా విన్నారు. 1935 లో తమిళనాడులోని తిరువన్నామలైలో ఉన్న శ్రీ రమణాశ్రమానికి వచ్చారు. అక్కడే ఉండిపోయారు. ఒక కుటీరం ఏర్పాటు చేసుకున్నారు. తన పేరును సాదు అరుణాచలం గా మార్చుకున్నారు.

భగవాన్ రమణ మహర్షి సమాధి చెందిన తర్వాత వేద పారాయణ ఆగిపోయింది. అప్పుడు ఆయన వేద విద్యాలయం ఏర్పాటు చేశారు.

అంతేకాదు, మాతృ భూతేశ్వర ఆలయంలో శ్రీ చక్ర పూజ మొదలుపెట్టారు.

ఆయన నిగర్వి. నిరాడంబరుడు. పేరుకు తగినట్లే సాదు స్వభావిగా పేరు గడించారు. స్వామి భక్తిలో ఆయనకాయనే సాటి. రమణ మహర్షి మీద ఒక పుస్తకం రాశారు. అది 1961 లో అచ్చయ్యింది.

– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.