సొంతింటి ముస్తాబులో

నటి శృతి హాసన్ ముంబైలో ఇటీవల ఒక పెద్ద ఫ్లాట్ కొనుగోలు చేసింది.

ఈ సొంత ఇంటికి ముందు ఆమె బాంద్రాలోని ఒక ఫ్లాట్ ను అయిదేళ్లకు అద్దెకు తీసుకుంది. ఇప్పుడు ఆమె సొంతంగా ఒక ఇల్లు కొనుక్కుంది. ఈ ఇంట్లో ఆమె తనకు కావలసిన రీతిలో దగ్గరుండి డిజైన్ చేసుకుంటోంది. ఈ ఇంట్లో ఆమె సంగీతం వినడానికోసం, వీడియో చూడటం కోసం ప్రత్యేకించి ఒక రూం కేటాయించడం విశేషం. అలాగే లివింగ్ రూమును తన ఫోటోలు, తన తల్లిదండ్రుల ఫోటోలతో అలంకరించింది.

ప్రస్తుతం ఆమె డెహ్రాడూన్ లో ఒక సినిమా షూటింగ్ కోసం వెళ్ళింది. మరికొన్ని రోజుల్లోనే డెహ్రాడూన్ నుంచి ఆమె ముంబై చేరుకోనుంది. ఈలోగా ఇంట్లో చెయ్యవలసిన ముస్తాబు వ్యవహారాన్ని ఒక వ్యక్తికి అప్పగించారు. తన మిత్రురాలు వచ్చేలోపు ఈ విలాసవంతమైన ఫ్లాట్ ని సింగారించ వలసి ఉందని, ఆ పనిలో తాను నిమగ్నమయ్యానని శ్రుతిహాసన్ ఫ్రెండ్ ఒకరు చెప్పారు.

ఇలా ఉండగా తన ఫ్లాట్ అత్యంత సుందరంగా తయారవుతుండటం అంతా పెద్దల ఆశీర్వాదమేనని శృతి హాసన్ చెప్పారు.

Send a Comment

Your email address will not be published.