స్క్రిప్ట్ మార్చిన వెంకీ

విక్టరీ వెంకటేష్ నటించిన తాజా చిత్రం బాబు బంగారం. కొన్ని రోజుల క్రితమే ఇది విడుదల అయ్యింది. బోలెడు అంచనాలతో ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం ఆయన అభిమానులను మెప్పించలేకపోయింది. అభిమానులందరూ దర్శకుడు మారుతి వంకే వేలెత్తి చూపుతున్నారు. ఈ చిత్రం సరిగ్గా ఆడకపోవడానికి కారణం దర్శకుడే అని చెప్తున్నారు. అయితే ఓ అభిజ్ఞ వర్గాల మేరకు తెలిసిందేమిటంటే ఈ చిత్ర కథ అంతా మారిపోయిందని. మారుతి ఈ కథను వెంకటేష్ కి చెప్పినది వేరు. తీరా వెండితెరకెక్కిన కథ వేరట. మారుతి స్క్రిప్ట్ తోనే ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. అయితే కొంత షూటింగ్ అయిన తర్వాత స్క్రిప్ట్ లో మార్పులు అవసరమని కొన్ని ఒత్తిళ్లు వచ్చాయట. అప్పటికే కొన్ని సన్నివేశాలను తీసినప్పటికీ వాటిని మళ్ళీ షూట్ చేసినట్టు తెలిసింది. వెన్నెల కిశోర్, బ్రహ్మాజీ, మురళి శర్మ, జయప్రకాష్, నయనతార తదితరుల సన్నివేశాలు ఫైనల్ కట్ లోకి రాలేదట. స్క్రిప్ట్ లో వెంకీయే కొన్ని మార్పులు చేసినట్టు సమాచారం.

ఒరిజినల్ స్క్రిప్ట్ మేరకు గానీ సినిమా షూట్ చేసినట్టయితే ఈ చిత్రం విజయం మరోలా ఉండేదని కూడా టాక్ వచ్చింది. ఈ చిత్రం ద్వితీయార్ధం గురించి బోలెడు విమర్శలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

అయితే విమర్శల మాట ఎలా ఉన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ చిత్రం ఇప్పటికే దాదాపు పదిహేను కోట్లు సంపాదించింది.

Send a Comment

Your email address will not be published.