స్నేహమనేది

స్నేహమనేది
ఓ పువ్వులా కాదు
ఒక రోజులో పోసి
రాలిపోవడానికి

అది
ఆకాశంలోని నక్షత్రంలా
ఆకాశం
ఉన్నంత వరకు ఉంటుంది
2
చేతులు కలిపి
నడవటానికి
ప్రేమ ఉండక్కరలేదు
మంచి స్నేహం ఉంటె చాలు
3
ఎన్ని రోజులు మెలిగాము
అనేది ముఖ్యం కాదు
ఎన్ని రోజులు
నిజంగా మెలిగాము
అనేదే ముఖ్యం
4
కారణం లేకుండా
చెదరిపోవడానికి
ఇది కలా కాదు
కారణం చెప్పి
విడిపోవడానికి
ఇది ప్రేమా కాదు
ఊపిరి ఉన్నంత వరకు
కొనసాగుతుంది
నిజమైన స్నేహం
5
వేయి బంధాలు
మనల్ని వెతుక్కుంటూ
వస్తాయి
కానీ
వెతికినా
లభించని ఒకే బంధం
మంచి మిత్రులు
6
నీడ కూడా
వెలుగు ఉన్నంత వరకే
తోడు వస్తుంది
కానీ నిజమైన స్నేహం
ప్రాణం ఉన్నంత వరకు
తోడు వస్తుంది
– యామిజాల జగదీశ్

Send a Comment

Your email address will not be published.