హన్సిక బిజీ బిజీ

హన్సిక కెరీర్ బిజీ బిజీగా సాగుతోంది. ఆమె ప్రస్తుతం చేస్తున్నతొమ్మిది సినిమాలలో చాలావరకు డిసెంబర్ నెలాఖరు లోపల విడుదల కానున్నాయి. వాటిలో తెలుగు సినిమా ఒకటి. అదే ” పవర్ ” సినిమా.

పవర్ సినిమా తనకు ఓ ప్రత్యేక సినిమా అని ఆమె చెప్పింది. తన కెరీర్ లో అదొక గొప్ప చిత్రమని చెప్పిన హన్సిక అంతకుముందు చేయని పాత్రను ఈ చిత్రంలో చేసినట్టు పేర్కొంది. తన పాత్రలో ఎంతో కామెడీ ఉందని చెప్పింది.

పవర్ హీరో రవితేజ సహ నటులకు ఎంతో సహకరిస్తారని ఆమె తెలిపింది. ఆయన ఎంతో దయ గల వ్యక్తి అని ఆమె పొగిడింది. రవితేజతో కలిసి వర్క్ చేయడంతో ఎంతో అనుభవం సంపాదించానని అన్నాది. సెట్స్ లో తామందరం ఒక కుటుంబ సభ్యులుగా ఫీల్ అయ్యాం తప్ప ఎక్కడా తేడాలు రాలేదని చెప్పింది.

రవి తేజ ఎనర్జీ లెవల్ పోల్చడానికి కొలవడానికి అందదని హన్సిక చెప్పింది. ఆయన నటన, డ్యాన్స్ 25 ఏళ్ళ కుర్రాడిలా ఉన్నాయని, తమ మధ్య వయస్సు వ్యత్యాసం పెద్ద సమస్య కాలేదని ఆమె తెలిపింది.

హన్సిక తన కెరీర్ ను తెలుగు సినిమాల్లో లీడ్ యాక్ట్రెస్ గా మొదలుపెట్టింది. ఆమె ఇప్పుడు తమిళంలో బిజీ నటిగా మారింది. ఆమె ప్రస్తుతం తొమ్మిది సినిమాలు చేస్తుంటే వాటిలో ఎనిమిది తమిళంలోనే కావడం గమనార్హం. మరొకటి తెలుగు సినిమా. అదే పవర్ చిత్రం.

తనకు తమిళంలో మంచి స్క్రిప్ట్ లు వస్తున్నాయని, తమిళ పరిశ్రమలో తన స్థానం ఎంతో బాగుందని అంటూ తాను తెలుగు, తమిళం పరిశ్రమలలో ఎంతో కంఫర్ట్ గా ఉన్నాను కనుక హిందీ చిత్రాల పై దృష్టి సారించడం లేదని హన్సిక చెప్పింది.

తన కెరీర్ తెలుగు సినిమాతో మొదలైందని, ఇక్కడ బాగానే ఉందని, బాలీవుడ్ నుంచి తనకు ఎన్నో ఆఫర్లు వచ్చినా నో అని చెప్పినట్టు ఆమె స్పష్టం చేసింది. ఎక్కడ బాగుంటే అక్కడ స్థిరపడటం మంచిది కదా అని ఆమె చెప్పింది.

Send a Comment

Your email address will not be published.