హైదరాబాద్ బిర్యాని అంటే ఇష్టం

భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం.

Dhoniతనపై తీసిన చిత్రానికి సంబంధించి ప్రమోషన్ వర్క్ పై హైదరాబాద్ వచ్చిన ధోనీ మాట్లాడుతూ హైదరాబాద్ అనగానే తనకు ముందుగా గుర్తుకు వచ్చేది బిర్యాని అని చెప్పాడు. 2000 సంవత్సరంలో ఓ క్రికెట్ మ్యాచ్ ఆడటానికి హైదరాబాద్ వచ్చినప్పుడు తనకు ఇక్కడి బిర్యానీతో ఓ గొప్ప రుచి చవి చూశానని ఆయన అన్నాడు. అప్పటి నుంచి హైదరాబాదు కి వచ్చిన ప్రతి సారీ తానూ బిర్యాని తినడం మిస్ కానని అంటూ ఆ తర్వాత తనకు ఇక్కడి గాజులు చాలా అంటే ఇష్టమని, ఓ సారి తన భార్యకు గాజులు కొనుక్కుని వెళ్లానని చెప్పాడు.

బాహుబలి – 2 చిరం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఆయన తెలిపాడు.

ఇలా ఉండగా, ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి మాట్లాడుతూ, ఈ వేదికపైకి వస్తుంటే చిన్నపిల్లాడిలా ఫీల్ అవుతున్నానని అన్నాడు. ధోనీ పక్కన నిల్చోవడం చెప్పలేని ఫీల్ అని అంటూ, మీ అందరికీ నా మీద కాస్తంత జెలసీ ఉండవచ్చని, కారణం నేను ఇక్కడ ధోనీ పక్కనే ఇలా నిల్చోడం అని రాజమౌళి చెప్పాడు. తనకెంతో ఆనందంగా ఉందని ఆయన అన్నాడు. ధోనీ చిత్ర ఆడియో ఫంక్షన్ కి తనను రమ్మన్నప్పుడు ఎంతో ఆనందంగా ఫీలైనట్టు ఆయన తెలిపాడు.

అంతకుముందు చెన్నైలో ఎం ఎస్ ధోనీ సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలిసి మాట్లాడాడు. ఈ చిత్రం తమిళంలో కూడా డబ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో మీరు మీ పాత్ర పోషిస్తున్నారుగా అని రజనీకాంత్ అడగ్గా చిత్రంలో తన పాత్రను సుశాంత్ సింగ్ రాజ్ పుట్ పోషిస్తున్నట్టు ధోనీ జవాబిచ్చాడు.

Send a Comment

Your email address will not be published.