మాగురించి

తెలుగు భాషా పరిమళాలు ఒక మల్లెలా సువాసనలు వెదజల్లాలన్న ఆశ. తెలుగు తల్లి ఒడిలో అలుపెరుగని ప్రయాణం చేసి సేద దీర్చుకోవాలన్న ఈ శ్వాస. ఈ ఆశ, శ్వాసల మధ్య నిరంతర పోరాటమే ఈ తెలుగు మల్లి ఆశయం.

ప్రవాసాంధ్రులకు ఆంధ్రమృత సాహితీ సుగంధాలు అందించాలన్న తపన. మరియు భువన విజయ కవనాలు ఆస్ట్రేలియా న్యూజిలాండ్ దేశాల్లో అందర నోట వినాలని ఆశయంతో ఈ తెలుగు మల్లి అంతర్జాలంలో ఉద్భవించింది.

ఎందరో మహానుభావులు. ఈ తెలుగు భాషా సాహితీ సేవలో కలమే గాని కాల మెరుగని తపోధనులెందరో. వారందరికీ నమస్సుమాంజలి.

మనలో కవితలు, కధలు, పద్యాలు వ్రాసే వాళ్ళు, చదివి ఆస్వాదించే వాళ్ళు విని ఆదరించే వాళ్ళు అందరూ ఒక మహోన్నతమైన వ్యక్తిత్వం గల వాళ్ళే.

సాహితీ పరిభాషలో ఈ సిరిమల్లె మొగ్గ తొడిగి ఏడేళ్ళ పైబడింది. పూవు పుట్టగనే పరిమళిస్తుందన్న నానుడికి సరిపోలిగ్గా మొగ్గ తొడిగినప్పుడే తన సుందరమైన అందాలను విరబూయడం మొదలు పెట్టింది. ప్రతీ తెలుగు వాకిట ఈ సువాసనలు తెలుగుదనాన్ని నింపి మన తరతరాల వెలుగుని పునరుద్దరించ గలదని ఆసిస్తూ..

ఇందులో ముఖ్యంగా మన తెలుగు వారికి సంబందించిన వార్తా విశేషాలు, అంతర్రాష్ట్ర వార్తలు, మన పండగలు, మన వారు నిర్వహించిన సంస్కృతిక కార్యక్రమాలు, అలాగే చిన్న పిల్లలకు సంబంధించి తెలుగు నేర్చుకోవడానికి దృశ్య శ్రవణ మాధ్యమాలు, వంటలు, మరియు కొన్ని ప్రత్యేకమైన అంశాలు వున్నయి. మన తెలుగు వారికి ఉపయోగపడుతుందని మీకేదైనా అనిపిస్తే మీరు ఇమైలు ద్వారా మాకు పంపవచ్చు. మాకు సమాచారం అందిన 24-48 గంటల మధ్య అ విషయం వెబ్సైటు లో వుంటుంది.