అందమైన మార్గం

ప్రేమ వ్యక్తీకరణకు అందమైన అసలైన మార్గం ముద్దు అని నటి రేజీనా కాసాండ్రా చెప్పారు. అది సరైన పద్దతే అన్నది ఆమె అభిప్రాయం.
రా రా కృష్ణయ్య సినిమాలో ఆమె సందీప్ కిషన్ కు జోడీగా నటించారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ఆమె నమ్మకం.
ప్రేమ కథల చిత్రీకరణ ఎప్పుడూ ఒకేలా ఉంటే అందులో థ్రిల్  ఏముంటుంది?
రేజీనా మాట్లాడుతూ “మా మొదటి సినిమా రొటీన్ లవ్ స్టొరీ షూటింగ్ అప్పుడు మాకు ఒకరి గురించి ఒకరికి పెద్దగా తెలియదు. అయితే ఆ తర్వాత మేము సన్నిహిత మిత్రులమయ్యాము. ఈ సాన్నిహిత్యం రా రా కృష్ణయ్య సినిమా షూటింగ్ అప్పుడు ఎంతగానో తోడ్పడింది. ఒకరినొకరు అర్ధం చేసుకుని నటించేందుకు వీలు కలిగింది. మా నటన కచ్చితంగా సింక్ అయ్యింది. ఎక్కడా దారి తప్ప లేదు. ఎక్కడ ఏది అవసరమో ఏది అనవసరమో ఒకరితో ఒకరు మాట్లాడుకుని సన్నివేశానికి తగినట్లు నటించాము. ఈ సినిమాలో ఒక సీనులో ముద్దు పెట్టుకునే సన్నివేశం ఒకటుంది. టాలీవుడ్ లో ఈలాంటి ముద్దు సీనులు పెద్దగా ఉండవు. కానీ ముద్దు సీనుని  భిన్నంగా చూడకూడదు. మిగిలిన సన్నివేశాలు ఎలాంటివో ఆ కోవలోనే ఈ లిప్ లాక్ సీన్ కూడా చూడాలి. ముద్దు సీనుతో ప్రేక్షకులను ఆకట్టుకోవలన్నది మా ఉద్దేశం కాదు. అయితే ఒక ప్రేమ కథను చూపాలనుకున్నప్పుడు ఆ ప్రేమను ఎలా వ్యక్తం చెయ్యాలి…? ఇద్దరి మధ్య సాన్నిహిత్యం చూపడానికి ఇలాంటి సన్నివేశం తప్పదు కదా..? ఇదేదో భిన్నమైనది కాదు. నిజ జీవితంలో అసలైన ప్రేమ బంధంలో ఇలాంటిది ఉంటుంది కదా…? వ్యక్తిగతంగా చూస్తే ఒక షూటింగులో ముద్దు సీను కొంచం అసభ్యంగానే అనిపిస్తుంది. దీనిని నేను కాదనలేను. కానీ కథకు, పాత్రకు అవసరమైతే అలాంటి సన్నివేశం తప్పదు కదా…అదే గానీ లేకపోతే మొత్తం ప్లాట్ పడిపోతుంది…” అని చెప్పింది.

Send a Comment

Your email address will not be published.