అఖిల్ తో మరో సంస్థ ఒప్పందం

అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్ ఇప్పటికింకా తెరంగేట్రం చెయ్యలేదు. అయితేనేం….. అంతలోనే కొన్ని సంస్థలు ఆయనతో ఒప్పందాలు చేసుకుంటున్నాయి. కొన్ని కంపెనీలు ఆయనను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించుకున్నాయి.
తాజాగా, ఒక ప్రముఖ శీతల పానీయాల సంస్థ అఖిల్ తో ఒప్పందం చేసుకుంది. ఆ సంస్థ పేరు పెప్సీకో.  అఖిల్ ను తమ  ప్రచారకర్తగా నియమించుకుంది.
దక్షిణ భారత దేశంలో  తమ మార్కెట్ వాటాను మరింత పెంచుకోవడానికి గాను పెప్సీ సంస్థ ఇటు అఖిల్ తోను,  అటు తమిళ హీరో  ఆర్యతోను మాట్లాడి  బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించినట్టు పెప్సీకో ఇండియా సీనియర్ డైరెక్టర్ రుచిరా జైట్లీ చెప్పారు.  ఈ ఒప్పందం ప్రకారం వీళ్ళిద్దరూ  ‘మౌంటైన్ డ్యూ’ ప్రచార చిత్రాల్లో కనిపిస్తున్నారు.
ఇప్పటికింకా ఒక్క సినిమాలో కూడా పూర్తి స్థాయిలో ప్రేక్షకులకు కనిపించని అఖిల్  ఇలా ఒక ప్రముఖ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులు కావడం బట్టి ఆయన సినిమా చేస్తే మరెంత ఆదరాన్ లభిస్తుందో అని అనుకుంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

Send a Comment

Your email address will not be published.