ఆగడు చిత్రీకరణ మళ్ళీ ప్రారంభం

ప్రిన్సు మహేష్ బాబు నటిస్తున్న ఆగడు సినిమా షూటింగు  మళ్ళీ ఆరంభమైంది.  ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటిస్తోంది.
మధ్యలో కాస్త విశ్రాంతి తర్వాత మహేష్ బాబు చిత్ర యూనిట్ ని మళ్ళీ కలిసారు. రాజస్తానులో కొన్ని సన్నివేశాలు చిత్రీకరిద్దామని దర్శకుడు శ్రీను  వైట్ల అనుకున్నారు. కానీ వీలున్నంత త్వరగా షూటింగు ముగించికోవాలన్న ఉద్దేశంతో షూటింగు హైదరాబాద్ పరిసర ప్రాంతాలలోనే లాగించేస్తున్నారు.
ప్రకాష్ రాజ్ వివాదం ముగిసింది. ఆయనను ఈ చిత్రం నుంచి తప్పించేసి సోను సూద్ ను ఆయన స్థానంలో తీసుకున్నారు. ఇప్పుడు షూటింగు సాఫీగా సాగిపోతున్నదని దర్శకుడు శ్రీను వైట్ల తెలిపారు.
దాదాపు డెబ్బై శాతం చిత్రీకరణ అయిపోయిందని, జూన్ నాటికల్లా మొత్తం చిత్రం పనులు పూర్తి చేసి వీలున్నంత త్వరగా విడుదల చెయ్యాలన్నది యూనిట్ భోగట్టా.

Send a Comment

Your email address will not be published.