ఆటోనగర్ సూర్య

ఇప్పుడా అప్పుడా అంటూ దాదాపు ఏడాదిన్నర ఆలస్యంగా విడుదలైన సినిమా ఆటో నగర్ సూర్య. ఈ సినిమాలో నాగచైతన్య, సమంతా జంటగా నటించారు. దేవా కట్టా దర్శకత్వం వహించిన ఈ చిత్రం అంచనాలకు తగినట్టుగా లేదు.

విజయవాడలో ఆటోనగర్ అందరికీ తెలిసిన ప్రాంతం. బహుశా దర్శకుడు దేవా ఆ ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా మనముందు ఉంచి ఉండవచ్చు.

నాగచైతన్య బాల్యంలోనే తన తల్లిదండ్రులను ఓ ట్రైన్లో కోల్పోతాడు. అతను ఆ తర్వాత విజయవాడ చేరుకుంటాడు. ఆటోనగర్ లో అతను ఒక కారు మెకానిక్ గా ఎదుగుతాడు. అయితే ఆటో నగర్ అంతా స్థానిక మాఫియా నాయకుడు జయప్రకాశ్ రెడ్డి నియంత్రణలో ఉంటుంది. అలాగే నగర మేయర్ మధు గుప్పెట్లోనూ ఉంటుంది. వీరిద్దరికీ తెలియకుండా అక్కడ ఏదీ జరగడానికి వీలు లేదు. అటువంటి ప్రదేశంలో నాగచైతన్య బ్యాటరీతో నడిచే ఒక వాహనాన్ని తయారు చేస్తాడు. ఆ వాహనం ఉత్పత్తి కోసం అతను ఒక పెద్ద సంస్థతో ఒప్పందం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ విషయం మాఫియా లీడర్ చెవిన పడుతుంది. అంతే ఆ క్షణం నుంచి అతను నాగచైతన్యకు సమస్యలు సృష్టించడం మొదలుపెడతాడు. ఈ అడ్డంకులను అధిగమించి నాగచైతన్య తాను అనుకున్నది సాధించడం ఈ చిత్ర ప్రధాన కథనం. కానీ ఈ సినిమా యావరేజ్ గా ఉంది. కొన్ని చోట్ల నాగ చైఒతన్య నటన శివ చిత్రంలో నటించిన నాగార్జునను గుర్తుకు తెస్తుంది. అయినా అతని నటన బాగానే ఉంది.

సామంత విషయం వేరేగా చెప్పక్కర్లేదు.

దర్శకుడు దేవా సంభాషణలు బాగానే ఉన్నాయి. సాయికుమార్ సపోర్టింగ్ క్యారక్టర్ పాత్రలో నటించారు. అనూప్ రుబెన్ సంగీతం ఏవరేజ్ గా ఉంది. ఓహో అని చెప్పడానికి వీలు లేదు. పాటలు కూడా అంత గొప్పగా లేవు.

బ్రహ్మాండం పోర్షన్ అంతా వేస్ట్.

ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ పనితనం బాగుంది.

ఎందుకనో దేవా కట్టా ఈసారి అంతగా రాణించలేదు అనే విమర్శలు వినవస్తున్నాయి.

Send a Comment

Your email address will not be published.