" ఐ " నిర్మాత మీద ఆగ్రహం

మొన్న సంక్రాంతి పండగకి కె ఎస్ రామా రావు తీసిన “మళ్ళీ ఇది రాని రోజు ” సినిమా విడుదల కావలసింది. కానీ థియేటర్ దొరకక ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

ప్రముఖ నిర్మాత రామారావు మాట్లాడుతూ తమ సినిమా శర్వానంద్, నిత్య మీనన్ జంటగా నిర్మించినట్టు చెప్పారు. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాయని చెప్పారు. వాటిలో ఒకటి థియేటర్ లు దొరకకపోవడం అని ఆయన అన్నారు. విక్రం నటించిన “ఐ” చిత్రం సంక్రాంతి పండగ సమయంలో విడుదల కావడం వల్ల తమ సినిమా విడుదల చెయ్యలేకపోయామని అన్నారు.

“ఐ” తమిళ చిత్రం డబ్బింగ్ హక్కులు కొనుక్కున్న వ్యక్తి తమ తెలుగు సినిమాకి అనేక ఇబ్బందులు కలిపించారని ఆయన అన్నారు.

“ఐ” సినిమా హక్కులను తెలుగులో కొన్నుకున్నది నిర్మాత ఎన్ వీ ప్రసాద్. ఆయన ప్రస్తుతం ఏ పీ తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడుగా ఉన్నారు.

సంక్రాంతి పండగ తెలుగు ప్రేక్షకులకు  పెను పండగ అని, ఆ సమయంలో తమ సినిమా విడుదల చేయాలనుకున్నానని కానీ ఈ “ఐ”: సినిమా అనేక సినిమా థియేటర్ లను బుక్ చేసుకోవడంతో తమ సినిమా విడుదలకు అవకాశం దొరకలేదని అన్నారు. నిజానికి ఈ మధ్య విడుదల అయిన రెండు తెలుగు సినిమాలకన్నా తమ సినిమా ఎంతో మెరుగైనదని ఆయన చెప్పారు.

అయినదేదో అయ్యిందని, ప్రస్తుతం మంచి రోజు చూసుకుని తమ సినిమా సిడుదల చేస్తానని కె ఎస్ రామా రావు తెలిపారు.

Send a Comment

Your email address will not be published.