కంచె అంచనాలు దాటింది

<a href=”http://www.telugumalli.com/wp-content/uploads/2015/10/kanche.jpg”><img class=”alignleft size-full wp-image-14198″ title=”kanche” src=”http://www.telugumalli.com/wp-content/uploads/2015/10/kanche.jpg” alt=”” width=”222″ height=”148″ /></a>మంచి చిత్రం చూసామన్న తృప్తి మిగిల్చే కంచె లో వరుణ్ తేజ్, ప్రగ్య జైశ్వాల్, నికితిన్ ధీర్, అవసరాల శ్రీనివాస్ , గొల్లపూడి మారుతీరావు, షావుకారు జానకి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించారు.

ఈ చిత్రానికి చక్కని సాహిత్యాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి సమకూర్చగా చిరంతన్ భట్ సంగీతం స్వరపరిచారు.
చిత్రానికి మాటలు రాసింది సాయిమాధవ్ బుర్రా. క్రిష్ దర్శకత్వం రూపు దిద్దుకున్న ఈ చిత్రానికి నిర్మాతలు రాజీవ్ రెడ్డి, సాయిబాబు.

రెండవ ప్రపంచ యుద్ధం నాటి నేపథ్యంలో సాగించిన కథలో వరుణ్ తేజ్ హరిబాబు పాత్రలో నటించాడు. అతను తక్కువ కులానికి చెందిన యువకుడు. అయితే అతను జమిందారు వంశానికి చెందిన సీత పాత్రలో నటించిన ప్రగ్య జైశ్వాల్ ని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతనిని ప్రేమిస్తుంది. కానీ అతను తక్కువ కులం వాడని సీత పెళ్లికి ఆమె అన్నయ్య ఒప్పుకోడు. అన్నయ్య ఈశ్వర్ పాత్రలో నికితిన్ ధీర్ నటించాడు..

ఇది గతానికి సంబంధించిన కథ. ఇక వర్తమానంలోకి రాగా ఈశ్వర్, హరిబాబు బ్రిటిష్ సైన్యం తరఫున ఇటలీలో జర్మన్ దళాలకు వ్యతిరేకంగా పోరాడతారు. వారిపైన శత్రు సైన్యం దాడి చేస్తుంది. ఆ దాడిలో ఈశ్వర్ తో పాటు కొందరు సైన్యాధికారులు బందీలుగా దొరికిపోతారు. వారిని విడిపించడానికి హరిబాబు తన బృందంతో కలిసి పోరాడుతాడు. . ఈ పోరులో అతను ఎలా గెలిచాడు…. అతని ప్రేమ విజయవంతం అయ్యిందా వంటి విషయాలను తెరపై చూడాలి. చూడొచ్చు చిత్రం. మంచి ప్రయత్నం కనుక ప్రేక్షకుల మన్ననలు అందుతున్నాయి ఈ చిత్ర కథకు. కథనాన్ని క్రిష్ నడిపించిన తీరు బాగుంది. ఆయన దర్శకత్వంలోని ప్రత్యేకత అది. ఆయన చెప్పదలచుకున్న విషయంలో ఎక్కడా రాజీపడ లేదు. . కథనం నెమ్మదిగా ఉన్నట్టు అనిపించినా సీరియస్ సినిమానే ఇది.

వరుణ్ నటనలో ఎంతో మార్పు కనిపించింది. అతని సరసన ప్రగ్య జైశ్వాల్ కూడా బాగానే నటించింది. . . గొల్లపూడి తన పాత్రకు తగిన న్యాయం చేసారు. మిగిలిన వారి నటన కూడా బాగుంది.

Send a Comment

Your email address will not be published.