కాస్త ఆగండీ ... ప్లీజ్

మీడియా లో ఈ మధ్య ఎక్కువ గా  నా గురంచి వార్తలు వస్తున్నాయి. నేను  మనం సినిమా లో నటిస్తున్నాని, నా సినిమాకి కథ, దర్శకుడు  కూడా ఖరారు అయ్యాడు. ఇక సెట్స్ పైకి వెళ్ళడమే తరువాయి అని ఎన్నో వార్తలు వస్తున్నాయి. అవన్నీ ఒట్టి ఊహా గానాలే. ఇంతవరుకు నేను  సినిమా కథని ఫైనల్ చేయలేదు. తాతయ్య, నాన్న, అమ్మ, అన్నయ్య అభిమానులంతా  నా సినిమా కోసం ఎదురు చూస్తున్నారని తెలుసు. వీరందరినీ అలరించడానికి నాకు కూడా సినిమా చేయాలని ఉంది. అతి  త్వరలోనే  నా సినిమా వివరాలు నేనే స్వయంగా  ప్రకటిస్తాను.

సినిమా స్టొరీ ఎలా ఉంటుంది అని చాలా మంది అడుగుతున్నారు.  ప్రేమ కధనా, యాక్షన్ స్టోరీ నా అన్నది మాత్రం ప్రస్తుతానికి  సస్పెన్స్. మరో రెండు నెలల తర్వాత చెప్తాను. నా సినిమాకి  సీనియర్ దర్శకుడే దర్శకత్వం వహిస్తాడు.

ప్రస్తుతం నా దృష్టి మొత్తం స్టార్ ఆడుతున్న క్రికెట్ సిసిఎల్ పైనే ఉంది. ఈ నెల 25 నుంచి జరగబోయే ఈ సిసిఎల్ మ్యాచ్ ల్లో నేను తెలుగు వారియర్స్ తరుపున ఆడుతున్నాను. ఈ టీం కి  కెప్టెన్  విక్టరీ వెంకటేష్, వైస్ కెప్టెన్ నేను. ఇది ఎంతో ప్రత్యేకం గా భావిస్తున్నాను అని అఖిల్ అక్కినేని ఒక ఇంటర్వ్యూ లో చెప్పారు.

Send a Comment

Your email address will not be published.