గర్భవతి కాదు

ప్రముఖ నిర్మాణ సంస్థ, సుప్రసిద్ధ నటి విద్యాబాలన్ భర్త అయిన సిద్ధార్ధ రాయ్ కపూర్ తన భార్య గర్భవతి కాదు అని చెప్పుకోవలసిన పరిస్థితి ఎదురైంది.

సిద్ధార్ధ రాయ్ కపూర్, విద్యా బాలన్ వైవాహిక జీవితంపై అనేక రకాల వార్తలు ఇటీవల గుప్పుమన్నాయి. వారి మధ్య సంబంధాలు అంత సుముఖంగా లేవని వదంతులు పుట్టుకొచ్చాయి.

తమపై వచ్చిన వార్తలను సిద్ధార్ధ రాయ్ కపూర్ ఖండించారు.

జాతీయ చలనచిత్రాల అవార్డు సంబరాలప్పుడు కొందరు విలేకరులు సిద్ధార్ధ రాయ్ కపూర్ ను కలిసి వారి వైవాహిక జీవితంపై కొన్ని ప్రశ్నలడిగారు.

ఈ సందర్భంగా సిద్ధార్ధ రాయ్ కపూర్ జవాబిస్తూ విద్యా బాలన్ తో తన వైవాహిక బంధం స్వర్గంలా హాయిగా ఉందని చెప్పారు. కొన్ని పనుల ఒత్తిడి వల్ల కొన్ని ఈవెంట్లకు తాము ఒక్కటిగా హాజరు కాలేకపోతున్నామని, అంతేతప్ప మా మధ్య ఎలాంటి గొడవలూ, అభిప్రాయభేదాలూ లేవని ఆయన స్పష్టం చేసారు. తాము విడివిడిగా కొన్ని కార్యక్రమాలకు హాజరు కావడంతో మీడియా తమకు తోచినట్టు తమపై వార్తలు రాస్తున్నాయని, వాటిలో నిజం లేదని అన్నారు. తమ పెళ్లి ఎంత హ్యాపీగా జరిగిందో అంత కన్నా రెట్టింపు ఆనందంతో తాము ఒక్కటిగా రోజులు గడుపుతున్నామని ఆయన చెప్పారు. ఇందులో ఎవరూ ఎలాంటి అనుమానాలూ పెట్టుకోవద్దని ఆయన అంటూ విద్యా బాలన్ ఆరోగ్యపరంగా కొన్ని మైనర్ సమస్యలు  ఎదుర్కోక తప్పలేదని, ఆమె గర్భవతి కాలేదని సిద్ధార్ధ రాయ్ కపూర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు.

Send a Comment

Your email address will not be published.