గౌతమి మళ్ళీ వస్తున్నారు

కమల్ హాసన్ జీవితభాగస్వామి మళ్ళీ వెండితెరపై కనిపించబోతున్నారు. ఒకప్పుడు తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో ఆమె నటించిన సంగతి తెలిసిందే. ఆమె  దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. మలయాళంలో వచ్చిన దృశ్యం చిత్రం ఇప్పుడు తమిళంలోనూ, హిందీలోనూ  రిమేక్ చేస్తున్నారు. అందులో గౌతమి నటిస్తున్నారు. ఆమె చివరిసారిగా 2006లో వెండితెరపై కనిపించారు. ఆ చిత్రం పేరు శాసనం. అలాగే ఆ సమయంలోనే ఆమె ప్యార్ హువా చోరి, త్రిమూర్తి  తదితర హిందీ చిత్రాలలోనూ  నటించారు. ఇప్పుడు ఆమె మళ్ళీ నటించడాన్ని ప్రస్తావిస్తూ కమల్ హాసన్ ఇలా అన్నారు ….”దృశ్యం ఒక ఫ్యామిలీ కథనం. గౌతమికి ఆ కథ బాగా నచ్చింది. ఇప్పటికే మేము యాభై శాతం పూర్తి చేసాము. ఈ చిత్రం పేరు పాపనాశం. ఒక సామాన్య వ్యక్తి కథ ఇది. నేను ఒక కేబుల్ ఆపరేటర్ గా నటిస్తున్నాను….” అని. తెలుగులో ఈ చిత్రం ఇప్పటికే వెంకటేష్ హీరోగా ఆంద్ర ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది కూడా.

Send a Comment

Your email address will not be published.