చీకటి రాజ్యం

బహుముఖ ప్రజ్ఞాశాలి కమల్ హాసన్ తదుపరి చిత్రం చీకటి రాజ్యం.

ఈ కొత్త చిత్రం గురించి కమల్ మాట్లాడుతూ “ఇది ద్విభాషా చిత్రం. ఈ చిత్రం ఒకే సారి తమిళంలోనూ, తెలుగులోనూ నిర్మితమవుతుంది. తమిళంలో ఈ చిత్రం టైటిల్ తూన్గా వనం. అంటే నిద్రలేని అరణ్యం. తెలుగులో ఆ చిత్రం టైటిల్ చీకటి రాజ్యం. ఇదొక థ్రిల్లర్ చిత్రం. ఈ చిత్రంలో నాతోపాటు త్రిషా, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు.

తెలుగు పరిశ్రమలో నా మొదటి చిత్రం మరో చరిత్ర రికార్డ్ బ్రేకింగ్ చిత్రం. ఆ చిత్రం ద్వారానే హిందీలో ఏక తుజే ఖేలియే చిత్రం తీయడం జరిగింది.

తమిళంతో పోలిస్తే నేను తెలుగులో చేసిన సినిమాల సంఖ్య తక్కువే. అయితే నేను తెలుగులో చేసిన సినిమాలలో 90 శాతం విజయం చవిచూసాను. అది నాకు ఆనందమే.

తెలుగు ప్రేక్షకులు నన్ను ఎంతగానో ఆదరించారు. అభిమానించారు. నాపట్ల ఎంతో ప్రేమాభిమానాలు చూపించారు. చూపిస్తున్నారు. తెలుగులో ఒక్కో ప్రాజెక్ట్ మధ్య ఎంతో గ్యాప్ ఉన్న రోజుల్లోనూ తెలుగు అభిమానులు నాకు ఇచ్చిన మద్దతు, చూపించిన ప్రేమ చిరస్మరణీయం. నేను ఒక కొత్త ప్రాజెక్టు తో వస్తానని తెలుగు ప్రేక్షకులకు ఇచ్చిన మాట మేర ఓ మంచి కథతోనే చీకటి రాజ్యంగా వస్తున్నాను. వారికిచ్చిన హామీని నెరవేర్చగలననే నమ్మకం నాకుంది. ఈ చీకటి రాజ్యం చిత్రానికి నా అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ ఎం సెల్వా దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన నా వద్ద ఏడేళ్ళుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నారు.” అని చెప్పారు.

Send a Comment

Your email address will not be published.