జీపు అమ్మేసిన పవన్ !

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన జీపుని అమ్మేయడం వార్తయ్యింది. ఆర్ధిక సమస్యల కారణంగానే పవన్ తన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న జీపుని అమ్మేసినట్టు తెలిసింది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో అప్పు చేయడం కన్నా జీప్ అమ్మేయడం ఉత్తమం అని పవన్ అనుకున్నట్టు తెలియవచ్చింది. టాలీవుడ్ పరిశ్రమలో నటనకు ఎక్కువ డబ్బులు పుచ్చుకునే వారు పవన్ కళ్యాణ్!

రామ్ చరణ్ నిశ్చతార్దానికి కొన్ని రోజుల ముందు పవన్ కళ్యాణ్ 2011 లో మెర్స్ డెస్ జీ 55 ని కొనుగోలుచేశారు. ఆ కారు ఖరీదు కోటీ పదిహేను లక్షలు. అప్పట్లో పవన్ కళ్యాణ్ అంటుండే వారు – “చిత్రాలు చేస్తున్నప్పుడే నా దగ్గర డబ్బులు ఉంటాయి” అని.

ఆయన తాను చేసే సహాయాలు గురించి ఎక్కడా పబ్లిసిటీ చేసుకోవడానికి ఇష్టపడే వారు కాదు.

“బహుశా ఎవరికైనా అత్యవసరమై ఉండవచ్చని, వారిని ఆదుకోవడానికి పవన్ కళ్యాణ్ జీప్ అమ్మేసి ఉంటారు” అని ఓ అభిజ్ఞ వర్గ మాట.

రాజకీయాలలోకి వచ్చినప్పటి నుంచి ఆయన అదే పనిగా సినిమాలు చేయడం లేదు. అంతెందుకు ఒక సారైతే తానిక సినిమాల నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని, తన దృష్టంతా రాజకీయాలపై కేంద్రీకరించాలని ఉందని చెప్పుకున్నారు కూడా.

విలాసవంతంగా బతకాలని అనుకోవడం లేదని, మామూలుగా కూడా తానూ బతగ్గలనని చెప్పుకునే పవన్ ఓ సామాన్య వ్యక్తిలా సిటీ బస్సులో తాను ప్రయాణిస్తానని చెప్పారు. అయితే అందుకు తగిన ప్రైవసీ కల్పిస్తే అని అన్నారు.

Send a Comment

Your email address will not be published.