టాలీవుడ్ కి మరో ముంబై నటుడు

ముంబైకి చెందిన మరో నటుడు టాలీవుడ్ కి పరిచయమవుతున్నాడు. అతని పేరు అర్హాన్ ఖాన్ . ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించిన వల్లి సినిమాతో అర్హాన్ ఖాన్ రంగప్రవేశం చేసాడు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం ఈ ఛిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో ఉంది.

అర్హాన్ ఖాన్ మాట్లాడుతూ “విజయేంద్ర ప్రసాద్ గారు ముంబై వచ్చి నన్ను కలిసి కథ మొత్తం టూకీగా చెప్పారు. దానితో కథ నచ్చి నటించడానికి ఓకే చెప్పాను. స్క్రిప్ట్ ఎంతో ఆసక్తికరంగా ఉంది. గొప్పగా ఉంది” అన్నాడు.

ఫిట్నెస్ విషయంలో ఎంతో శ్రద్ధ చూపించే అర్హాన్ ఖాన్ మార్షల్ ఆర్ట్స్ కు సంబంధించి మిహిర్ సింగ్ దగ్గర శిక్షణ పొందుతున్నాడు. అర్హాన్ ఖాన్ నటిస్తున్న తొలి తెలుగు చిత్రం వల్లీ. అంతకుముందు హిందీలో ఒక చిత్రంలో నటించాడు కానీ అది విడుదల కాలేదు. ఆ చిత్రం గురించి అంత కన్నా ఎక్కువగా చెప్పదలచుకోలేదని ఆయన అన్నాడు.

ఇప్పుడు రెండు హిందీ సినిమాలు చేయడానికి ఒప్పందం చేసుకున్న అర్హాన్ ఆ రెండు సినిమాలు నిర్మిస్తున్న సంస్థలు పెద్దవే అని అన్నాడు.

అర్హాన్ తెలుగు సినిమాలు చాలానే చూసాడు. అయితే ఇప్పుడు రానున్న వల్లి సినిమా తనకు ఓ గొప్ప అనుభవమని చెప్పాడు. ఇది ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని అన్నాడు. విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం అమోఘమంటూ భజరంగి భైజాన్ ముందే తాను విజయేంద్ర ప్రసాద్ ను కలిసానని, ఆయన గొప్ప స్క్రిప్ట్ రైటర్ అని, మంచి మానవత గల వ్యక్తి అని చెప్పాడు. ఆయన తనకు గురువు లాంటి వారని అన్నాడు. ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నాను అని కూడా చెప్పాడు. ఈగ చిత్రం తనకెంతో ఇష్టమని అంటూ ఈగ చిత్ర కథకు ఏది ప్రేరణ కలిగించింది అని అడిగినప్పుడు ఆయన చెప్పిన తీరు ఇప్పటికీ మరవలేదన్నాడు. ఓ డిన్నర్ కి వెళ్ళినప్పుడు అక్కడ కొందరు ఈగను చూసి ఇరిటేట్ అయ్యారని, అది చూసి ఓ కథ తయారు చేసి తెర కెక్కించడం జరిగినట్టు విజయేంద్ర ప్రసాద్ ఈగ చిత్రం పుట్టుక పై చెప్పిన తీరు భలేగా ఉందని అర్హాన్ అన్నాడు.

వల్లి చిత్రం బాగా వచ్చిందని, అన్ని వర్గాల వారిని ఇది ఆకట్టుకోవడం ఖాయమని కూడా తెలిపాడు. ఇది కమర్షియల్ చిత్రమే అయినా ప్రేక్షకులను ఆకట్టు కోవడం తధ్యమని అన్నాడు.

తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాలు బాగా చూస్తానని, వారితో కలిసి నటించాలన్నది తన కోరికని, ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానని, తాను ఏ పాత్ర వేయడానికైనా సిద్ధమే అని అర్హాన్ ఖాన్ చెప్పాడు.

Send a Comment

Your email address will not be published.