టాలీవుడ్ లో ఉండాలనుకుంటున్నా

గత ఏడాది మిస్ వరల్డ్ పోటీలలో భారత దేశానికి ప్రాతినిధ్యం వహించిన అదితి ఆర్య కళ్యాన్ రాం తో కలిసి “ఇజం” అనే చిత్రంలో నటించింది.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “ఇజం” తనకో మంచి చాలెంజ్ విసిరిన చిత్రమని చెప్పింది. తెలుగు భాషతో మొదట కొన్ని రోజులు కష్టపడినా తానూ తన పంధాలో ప్రాక్టీస్ చేసుకుని షూటింగ్ కి రెడీ అయ్యే దానినని ఆమె చెప్పింది. అసిస్టెంట్ డైరెక్టర్ ఈ విషయంలో ఎంతో సహాయం చేసారని అంటూ తెలుగు పాటలు, డాన్స్ విషయమై తాను ప్రిపేర్ కావడం కోసం యు ట్యూబ్ లో ఎన్నో వీడియోస్ చూశానని అన్నాది.

“ఇజం” చిత్రం కోసం దర్శకుడు పూరీ జగన్నాథ్ కొత్త నటి కోసం అన్వేషిస్తూ అదితి ఆర్యను గుర్తించారు. ఓ ఏజెన్సీ ద్వారా అదితి ఆర్య విషయం ఆయనకు దృష్టికి వచ్చింది. ఆడిషన్ సమయంలో తనకు భారీ తెలుగు స్క్రిప్ట్ ఇచ్చారని, హిందీలోకి అనువదించిన ఎన్నో తెలుగు సినిమాలు తాను చూశానని, తెలుగులో చాలా మంది నటులు తనకు తెలుసునని చెప్పింది. చాలా మంది అమ్మాయిలను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన క్రమంలో పూరీ జగన్నాథ్ గారు వారి భవితవ్యాన్ని మంచిగా మార్చారని ఆమె తెలిపింది. మొదట్లో తాను కొంత నెర్వస్ గా ఫీల్ అయినా యూనిట్ లో ప్రతి ఒకరు ఎంతగానో సహకరించారని అన్నది. అందుకే మరికొంత కాలం టాలీవుడ్ లోనే ఉండి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఉందని తెలిపింది అదితి ఆర్య.

ఇక్కడ గొప్ప గొప్ప నటులతో దర్శకులతో కలిసి వర్క్ చేయాలన్నది తన కల అని చెప్పింది అదితి. తెలుగు భాష అందుకు ఏ విధంగానూ అవరోధం కాదని అంటూ తమిళం, ఆంగ్లం స్పానిష్ ఆ మాటకొస్తే అన్ని భాషల్లోనూ నటించాలని ఉందని అదితి ఆర్య తెలిపింది.

దేనికైనా స్క్రిప్ట్ ముఖ్యమని ఆమె అభిప్రాయం. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలతోపాటు కళాత్మకమైన చిత్రాలలో కూడా నటించాలన్నది తన ఆశ అని చెప్పింది.

Send a Comment

Your email address will not be published.