దేవత నుంచి "పార్వతి" కి

మహాదేవ అనే సీరియల్ పార్వతి పాత్ర ద్వారా పరిచితురాలైన సోనారికా వయస్సు ఇంకా 19 ఏళ్ళే ఆమె మొదటిసారిగా దేవత పాత్రలో కనిపించినప్పుడు.

“మొదట ఆ పాత్ర ఇచ్చినప్పుడు తిరస్కరించాను. అప్పుడు నా వయస్సు 19 సంవత్సరాలే. పార్వతీ మాతగా వద్దనుకున్నాను. నన్ను అందరూ మాతగా పిలుస్తారని భయపడ్డాను. పైగా సీరియల్ లో ఇద్దరు పిల్లలకు తల్లిగా నటించాలి” అన్నారు సోనారికా.

పైగా ఆ పాత్ర ఒక సీనియర్ కి చెందినది. అలాగే అనుభవజ్ఞులకు చెందినా పాత్ర.

అయితే తల్లిదండ్రులు, బామ్మ ఆ సీరియల్ లో నటించమని చెప్పడంతో ఆమె నటించడానికి ఒప్పుకుంది.

“అది దేవుడి కానుకగా నిన్ను వెతుక్కుంటూ వచ్చింది కనుక ఆ పాత్ర చెయ్యడానికి ఆలోచించకు” అని పెద్దలు చెప్పడంతో సరేనని తానూ ఒప్పుకున్నానని సోనారికా అన్నారు.

సొనారికాకు శివుడంటే చాలా ఇష్టమైన దేవుడు. ఆమె శివ భక్తురాలు.

“పార్వతి పాత్ర చెయ్యమని ఆఫర్ వచ్చినప్పుడు కలలో పాములు వచ్చేవి. నేను వెంటనే మా బామ్మతో కలలోకోచ్చిన పాముల విషయం చెప్పాను. ఎందుకు అలా వస్తున్నాయో చెప్పమని అడిగాను. నువ్వు మొదట్లో ఆ పాత్ర చెయ్యనన్నావు కదా? అందుకే పాములు కలలోకోస్తున్నాయి అని బామ్మ చెప్పింది. కనుక ఇప్పటికైనా మించిపోయింది లేదు. పార్వతి పాత్ర ఒప్పుకో అని చెప్పింది” అని ఆమె తన బామ్మతో జరిగిన మాటలను చెప్పుకొచ్చింది.

ఆ సీరియల్ సంవత్సరం పాటు సాగింది. దానితో సోనారికా పేరు ప్రతి ఇంటా పాకింది. అందరూ ఆమె గురించి మాట్లాడుకున్నారు. పల్లె ప్రజలైతే ఆమె కాళ్ళకు మొక్కే వారు. కొన్ని చోట్ల అయితే ఆమెకు హారతి పట్టారు కూడా.

మహాదేవ సోనారికా నటించిన మొదటి సీరియల్ కాదు. తుం దేనా సాత్ మేరా అనే సీరియల్ లో ఆమె మొదటిసారిగా నటించింది. అప్పుడు ఆమె పదో తరగతి చదువుతోంది. అప్పట్లో ఆమెకు కొన్ని అవకాశాలు వచ్చినా ప్లస్ టూ మీద దృష్టి సారించడంతో వచ్చిన ఆఫర్లను వద్దనుకుంది. ఆ మాటే నిర్మాతలతో చెప్పింది. ముందు చదువు పూర్తి చేసిన తర్వాతే నటన అని.

మహాదేవ సీరియల్ క్షెస్థున్నప్పుదు సోనారికా కు హిందీ ఫిల్మ్స్ లో ఆఫర్లు వచ్చాయి. కానీ వాటిని ఆమె తిరస్కరించింది. అప్పుడే మరో టీవీ సీరియల్ చేయడానికి ఒప్పుకోవడంతో సినిమా ఆఫర్లను వద్దనుకుంది.

ఆ సీరియల్ పూర్తి అయిన తర్వాత తెలుగు దర్శకుడు యోగి ఆమెను కలిసి తన సినిమా జాదుగాడు సినిమాలో నటించమని అడిగారు. ఆ సినిమా కథ ఆసక్తిగా అనిపించి అందులో నటించడానికి ఒప్పుకున్నానని ఆమె చెప్పారు. ఆ సినిమాలో ఆమె దాదాపు ముప్పై రకాల కాస్ట్యూమ్స్ తో నటించింది. ఆ సినిమా షూటింగ్ దాదాపుగా ముగింపుకొచ్చింది. ఈ చిత్రానికి ఆమె సంతకం చేసేటప్పుడు భాష విషయంలో కాస్త భయపడింది. అయితే శౌర్య, ఇతర చిత్ర సిబ్బంది ఆమెకు ఎంతగానో సహకరించారు. వారి సహకారంతో భాష విషయంలో సమస్యలు అధిగమించానని సోనారికా అన్నాది. తెలుగు మాటలను హిందీలో రాసుకుని మాట్లాడానని ఆమె చెప్పింది.

ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ఈ తెలుగు చిత్రంలో ఆమె పాత్ర పేరు పార్వతి. దర్శకుడు ఈ పాత్ర పేరు చెప్పినప్పుడు ఆమె ఆశ్చర్యపోయింది. ఇదంతా యాదృచ్చికమే అని ఆమె అంటోంది.

Send a Comment

Your email address will not be published.